Extramarital Affair: ప్రియుడి కోసం భార్య స్కెచ్.. మరో మహిళను రంగంలోకి దింపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Killed Her Husband For Extramarital Affair In Nandyala: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో.. పక్కా స్కెచ్‌తో భర్తని చంపింది ఓ మహిళ. తన ప్రియుడి సహకారంతో మరో మహిళను రంగంలోకి దింపి, భర్తకే వల వేసి, ఒక ప్రాంతానికి రప్పించి.. చివరికి భర్తని పొట్టన పెట్టుకుంది. ఆపై తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని నాటకమాడుతూ, కేసుని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, భార్యే అసలు హంతకురాలని తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Chris Gayle: గేల్, నీకసలు బుద్ధుందా.. విరాట్, రోహిత్ ఫ్యాన్స్ ఫైర్
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్ వెంకటన్న (42)కు భార్య శ్యామల, కొడుకు శరత్చంద్ర(9) ఉన్నారు. వెంకటన్న మెడికల్ షాపు నిర్వహిస్తుండగా.. భార్య ఇంటివద్దే చీరల వ్యాపారం చేస్తోంది. కొంతకాలం క్రితం శ్యామలకు బేతంచెర్లకు చెందిన కుమారస్వామితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే అది వివాహేతర సంబంధంగా మారింది. తన భర్తకు తెలియకుండా కుమారస్వామితో శ్యామల రాసలీలలు గుట్టుగా కొనసాగించింది. అయితే.. వీరి బంధం ఎంతోకాలం దాగి ఉండలేదు. ఎలాగోలా వెంకన్నకు వీరి బండారం తెలిసింది. ఇక అప్పటి నుంచి వెంకటన్న తన భార్యని వేధింపులకు గురి చేయడం స్టార్ట్ చేశాడు. కుమారస్వామికి దూరంగా ఉండాలని హెచ్చరించాడు.
ICC World Cup Qualifier: వెస్టిండీస్‌కి ఘోర అవమానం.. పసికూన దెబ్బకు వరల్డ్‌కప్ నుంచి ఔట్
అయితే.. ప్రియుడ్ని వదిలి ఉండలేకపోయిన శ్యామల, అడ్డుగా ఉన్న తన భర్తని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కుమారస్వామికి చెప్పింది. అప్పుడు వెంకటకన్నను ట్రాప్ చేసి, చంపాలని ప్లాన్ చేశారు. ఒక మహిళని రంగంలోకి దింపారు. ఆమెతో ఫోన్ చేయించి, కుమారస్వామిని ముగ్గులోకి దింపారు. ఈనెల 19న ఆ మహిళతో ఫోన్ చేయించి, భాస్కరాపురం గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ గట్టు వద్దకు రావాలని వెంకటన్నని పిలిపించారు. దాంతో.. అతడు వెంటనే అక్కడికి బైక్‌పై వెళ్లాడు. వెంకటన్న ఆ ప్రాంతానికి చేరుకోగానే.. తన నలుగురు స్నేహితులతో కలిసి కుమారస్వామి అతడ్ని చంపేశాడు. వెంకటన్న గొంతుకు బైక్ తీగ బిగించి హతమార్చారు. అనంతరం ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో మోది, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Devulapalli Amar: టీడీపీ 20 ఏళ్లు పాలించినా.. ఎందుకు ఇంకా పేదరికం ఉంది?
ఇలా తన భర్తని చంపించిన తర్వాత.. శ్యామల తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకేమీ ఎరుగనట్టుగా పోలీసుల ముందు నాటకమాడింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే.. శ్యామల మరీ ఓవర్‌గా ప్రవర్తించడంతో, పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో.. ఆమె కోణం నుంచి కేసుని విచారించడం మొదలుపెట్టగా, శ్యామలనే తన భర్త వెంకటన్నని చంపినట్టు తేలింది. ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే చంపేశానని ఒప్పుకుంది. ఆమెతో పాటు కుమారస్వామి, అతని నలుగురి స్నేహితుల్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!