Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes: ఇంగ్లండ్ (England)టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన తర్వాత నైట్‌క్లబ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు స్టోక్స్ కెప్టెన్సీపై మాత్రమే కాకుండా జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దర్యాప్తు ప్రారంభించడంతో స్టోక్స్ భవిష్యత్తుపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది.
జూన్ 8వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో బెన్ స్టోక్స్‌తో పాటు ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటన వివరాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రానప్పటికీ, జట్టు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందనే విషయంలో ECB ఈ విషయాన్ని క్రికెట్ రెగ్యులేటర్‌కు అప్పగించింది. దీంతో ఇద్దరు ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని ఇంగ్లండ్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అందిన సమాచారం ప్రకారం.. నైట్‌క్లబ్‌లో జరిగిన ఈ ఘటనలో సారసెన్స్ రగ్బీ క్లబ్‌కు చెందిన కొందరు ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. వారు తమ సీజన్ ముగింపు వేడుకలను జరుపుకుంటున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గస్ అట్కిన్సన్, ఓ అకాడమీ ఆటగాడి మధ్య జరిగిన వాగ్వాదమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
Also Read
- రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ఇక లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన టెస్టుల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గస్ అట్కిన్సన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బెన్ స్టోక్స్ బ్యాట్‌తో 12 పరుగులు చేయగా, బౌలింగ్‌లో ఒక వికెట్ మాత్రమే సాధించాడు. అయితే స్టోక్స్‌కు నైట్‌క్లబ్ వివాదాలు కొత్తేమీ కావు.. 2017లో బ్రిస్టల్ లోని ఓ నైట్‌క్లబ్ వెలుపల జరిగిన గొడవలో ఆయన ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో అరెస్టయ్యాడు. ఆ ఘటన అనంతరం కొంతకాలం జట్టు నుంచి సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మరోసారి నైట్‌క్లబ్ ఘటనలో పేరు వినిపించడంతో ఆయన కెప్టెన్సీ భవిష్యత్తుపై మాత్రమే కాకుండా జట్టులో కూడా స్థానం కోల్పోతాడని చర్చ మొదలైంది.
ప్రస్తుతం ECB దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై క్రికెట్ ప్రపంచం, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దర్యాప్తు నివేదిక ఆధారంగా స్టోక్స్‌పై చర్యలు ఉంటాయా? లేక కెప్టెన్సీ కొనసాగుతుందా? అన్నది తేలనుంది.
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!