Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan Lifestyle: ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం కలిగిన దేశాల గురించి మాట్లాడినప్పుడు జపాన్ పేరు తరచుగా వినిపిస్తుంది. వందేళ్లు దాటిన వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో జపాన్ ముందువరుసలో ఉంటుంది. వాళ్ళు ఎక్కువకాలం జీవించడం మాత్రమే కాదు, వృద్ధాప్యంలో కూడా చాలా మంది చురుకుగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం అందర్నీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏమిటి అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది.
జపాన్ ప్రజల రోజువారీ జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వారు సాధ్యమైనంత వరకు శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చిన్న దూరాలకు కూడా నడవడం, మెట్లు ఉపయోగించడం, రోజువారీ పనులను స్వయంగా చేసుకోవడం వంటి అలవాట్లు సాధారణంగా కనిపిస్తాయి. వ్యాయామాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా కాకుండా జీవనశైలిలో భాగంగా మార్చుకోవడం వారి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
అంతేకాదు ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జపాన్లో కూరగాయలు, పప్పుధాన్యాలు, సీ ఫుడ్ వంటి పదార్థాలు ఎక్కువగా వినియోగిస్తారు. అంతేకాకుండా అవసరానికి మించి తినకుండా మితంగా ఆహారం తీసుకోవడం అనే అలవాటు కూడా అక్కడ చాలామందిలో కనిపిస్తుంది. ఇక మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కూడా జపాన్ జీవనశైలిలో ముఖ్యమైనవి. చాలా మంది వృద్ధులు రిటైర్మెంట్ తర్వాత కూడా పూర్తిగా ఇంటికే పరిమితం కావడం కనిపించదు. వారు తమకు ఇష్టమైన పనులు చేయడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అలవాట్లను కొనసాగిస్తారు. దీని వల్ల ఒంటరితనం తగ్గి మానసికంగా చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది.
జపాన్లో వృద్ధులు కూడా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, చుట్టుపక్కల వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తుంటారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం సోషల్ అనుబంధాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నిద్ర, ఒత్తిడి నియంత్రణ, క్రమబద్ధమైన జీవనం వంటి అంశాలు కూడా వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒకే విధమైన క్రమశిక్షణతో జీవించడం వల్ల హెల్త్ సిస్టమ్ సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదం తగ్గవచ్చని భావిస్తున్నారు.
40 ఏళ్లకే ఇప్పుడు ఉంటారా? ఉడిపోతారా ? అన్నట్టు ఉంది చాలా దేశాలలో ప్రజల పరిస్థితి. మరి 100 ఏళ్లు వచ్చినా జపాన్ వాళ్ళు ఒకరి సాయం లేకుండా నడవగలుగుతున్నారంటే చాలా గొప్ప విషయమే. వాళ్ళను చూసి కొంతలో కొంత నేర్చుకున్నా సంతోషించవలసిందే. బతికే సంగతి ఎలా ఉన్నా, కనీసం రోగాలతో హాస్పిటల్ కి వెళ్ళే తిప్పల నుంచి కొంతలో కొంతైనా బయట పడవచ్చు. అందుకే ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జపాన్ జీవనశైలిపై ఆసక్తి పెరుగుతోంది.
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..