Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y31s 5G Launched: వివో (Vivo) నుండి కొత్త మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Vivo Y31s 5Gను మలేషియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ సూర్యరశ్మిలో కూడా స్పష్టమైన విజువల్స్ కనిపించేలా దీనిని “Sunlight Display”గా కంపెనీ ప్రచారం చేస్తోంది. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగంలో మెరుగైన అనుభూతిని అందించేలా డిస్ప్లేను రూపొందించారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్‌ను అమర్చారు. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఫోన్ అందుబాటులో ఉంది. రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి కార్యకలాపాలను సాఫీగా నిర్వహించే సామర్థ్యాన్ని ఈ ప్రాసెసర్ అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. దీనికి 2MP బోకే సెన్సార్ అందించారు. దీంతో పోర్ట్రెయిట్ ఫోటోలు మరింత బాగా తీసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఈ ఫోన్లో 6500mAh సామర్థ్యం గల BlueVolt బ్యాటరీని అమర్చారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అలాగే 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. Vivo Y31s 5Gలో 5G కనెక్టివిటీతో పాటు NFC, USB Type-C పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. కాల్ రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే Hi-Fi ఆడియో సపోర్ట్ ఈ ఫోన్లో లేదు. దృఢత్వం పరంగా ఈ ఫోన్ IP68, IP69, IP69K+ రేటింగ్స్‌తో వస్తోంది. దీంతో దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.
మలేషియాలో Vivo Y31s 5G ధర RM 1,499గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది రూ.35,200 వరకు ఉంటుంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బ్లాక్, పర్పుల్ రంగుల్లో లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌ను వివో మలేషియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు భాగస్వామ్య రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!