Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
- భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన
- అరంగేట్ర ఇన్నింగ్స్‌లో 6/33తో మెరిసిన మానవ్
- అమిత్ మిశ్రా అరుదైన రికార్డు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manav Suthar Scripts History on Test Debut: ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్లు పడగొట్టి భారత క్రికెట్లో అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ శతాబ్దంలో భారత తరఫున టెస్ట్ అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మానవ్ నిలిచాడు. 2008లో ఆస్ట్రేలియాపై అమిత్ మిశ్రా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో 5/71 గణాంకాలు నమోదు చేశాడు. ఇప్పుడు మానవ్ 6/33తో అమిత్ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు.
అయితే భారత టెస్ట్ చరిత్రలో అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జాబితాలో మాత్రం మానవ్ సుతార్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మాజీ స్పిన్నర్ నరేంద్ర హిర్వానీ అగ్ర స్థానంలో ఉన్నాడు. 1988లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో హిర్వానీ (8/61) vs బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 1967లో ఆస్ట్రేలియాపై అబిద్ అలీ (6/55), 1979లో ఆస్ట్రేలియాపై దిలీప్ దోషి (6/103)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మానవ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. యువ స్పిన్నర్ ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు క్రీజులో నిలవలేక చేతులెత్తేశారు. 22 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 10 మెయిడెన్లు వేసి.. కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి, 6 వికెట్లు పడగొట్టాడు. 1.50 ఎకానమీతో బౌలింగ్ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత భారత జట్టుకు మరో నాణ్యమైన స్పిన్నర్ దొరికాడని నెటిజెన్స్, ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఒత్తిడిని తట్టుకుని 6 వికెట్లతో మెరిసిన మానవ్.. భవిష్యత్తులో భారత స్పిన్ దళానికి కీలక బలంగా మారే అవకాశాలు ఉన్నాయి.
డెబ్యూ టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:
నరేంద్ర హిర్వానీ – 8/61 vs వెస్టిండీస్ (చెన్నై, 1988)
మానవ్ సుతార్ – 6/33 vs అఫ్గానిస్థాన్ (ముల్లాన్‌పూర్, 2026)
అబిద్ అలీ – 6/55 vs ఆస్ట్రేలియా (అడిలైడ్, 1967)
దిలీప్ దోషి – 6/103 vs ఆస్ట్రేలియా (చెన్నై, 1979)
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!