Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- నేడు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం..
- ప్రత్యేక పూజలు తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పణ..
- శ్రీస్వామివారికి అన్నాభిషేకం, శ్రీస్వామివారి ఆలయ ద్వారాలు మూసివేత..
- అమ్మవారికి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: నంద్యాల జిల్లాలోని పవిత్ర క్షేత్రం.. జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన.. మహాశక్తి పీఠాలలో ఒకటిగా ఉన్న శ్రీశైలం క్షేత్రంలో నేడు శ్రీ భ్రమరాంబికా అమ్మవారి వార్షిక కుంభోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తొలి విడత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మకాయలు, గుమ్మడికాయలను సమర్పిస్తారు. ఈ పూజలు శాస్త్రోక్తంగా జరుగుతుండగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందనున్నారు.
Read Also: Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఇక, సాయంకాలం శ్రీస్వామివారికి అన్నాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అన్నాన్ని కుంభరాశిగా పోసి, ఆలయ ఉద్యోగి గోవింద్ స్త్రీ వేషంలో అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అమ్మవారికి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన సమర్పిస్తారు. కుంభహారతి అనంతరం రెండో విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలను సమర్పిస్తారు. ఈ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక భక్తులకు అమ్మవారి నిజారూప దర్శనానికి అనుమతి ఇవ్వబడుతుంది. ఈ కుంభోత్సవం సందర్భంగా శ్రీశైలానికి భారీగా భక్తులు తరలి వస్తుండగా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!