Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: నంద్యాలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, పెట్రోల్ కొరత, మరియు వైసీపీ నేతలపై కేసుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పుదోవ పట్టుతోందని ఆరోపించారు. సీఎం తీసుకున్న తప్పు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు.. అమరావతి కాంట్రాక్టర్లకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంబటి రాంబాబు విమర్శించారు. ఆ జీవోను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ప్రభుత్వానికి అవమానకరమని, సీఎం దీనిపై సిగ్గుపడాలని అన్నారు. అమరావతి నిర్మాణం భారీ స్థాయిలో చేపట్టడం వల్లే సమస్యలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
అమరావతి ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం లేదని, అది తన జన్మలోనే కాదు, సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ జన్మలో కూడా పూర్తికాదని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు… ఈ ప్రాజెక్ట్ పేరిట అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే రూ. 75 వేల కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ, భవిష్యత్తులో ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలను దేవుళ్లుగా భావించే సీఎం, తరువాత కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. మంత్రి నారా లోకేష్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపించారు.
ఇక, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, పోలీసులు అధికార పార్టీ ఒత్తిడితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తనపై ఇప్పటికే 36 కేసులు నమోదు చేశారని, మరిన్ని కేసులు పెట్టినా కోర్టుకు హాజరవుతానని తెలిపారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీహరిని అరెస్టు చేసి ఆటోలో తీసుకెళ్లడం దుర్వినియోగమని విమర్శించారు. కేసుల పేరిట వైసీపీ నేతలను మానసికంగా వేధిస్తున్నారని, విలేకరులపై కూడా దాడులు జరుగుతున్నాయని అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులు కొందరు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. పోలీసుల వేధింపులు ఆగకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో, శిల్ప రవి మాట్లాడుతూ పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవని, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదానీ డేటా సెంటర్‌ను గూగుల్ డేటా సెంటర్‌గా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన కూడా విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!