ఆశాడ మాసం ప్రారంభం అయితే చాలు తెలంగాణలో బోనాల పండగ సందడి అంతా ఇంతా కాదు. పల్లె పట్నం అనే తేడా లేకుండా బోనాల సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక హైదరాబాద్ లో ఉజ్జయిని, గోల్కోండ, లష్కర్ బోనాల పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రెండ్రోజుల పాటు వైన్ షాపులు మూతపడనన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్స్ షాపులు మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్ ఈస్ట్, నార్త్, హైదరాబాద్ లోని మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మద్యం దుకాణాలు క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read:Rajinikanth : రజినీపై ఆర్జీవీ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..
రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగనున్నాయి. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తర్వాత లక్షలాదిమంది భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.