పేర్నినాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం.. వినలేని విధంగా జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పల హారికను పచ్చి బూతులు తిట్టారని పేర్కొన్నారు. హారికకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కారు దిగమని ఒత్తిడి చేశారు.
రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఏ6గా పేర్ని నాని పేరును చేర్చారు.. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పేర్ని నాని పై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు..
వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ జెండా మోస్తూ.. జై కొట్టినంత సేపు మాత్రమే నాయకులకు, కార్యకర్తలు జై కొడతారన్నారు. జెండా వదిలితే మాత్రం ఆ నాయకుడు కార్యకర్తకు అవసరం లేదని చెప్పారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పటికే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. చివరకు జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని అన్నారు.
వైఎస్ జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం కూటమి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌లో ఉంటుందని ఆరోపించారు.
తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్నినాని
రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఢిల్లీ నుంచి చాలా అబద్ధాలను పోగేసుకుని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై జేపీ నడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటైనా చెప్పారా అని నాని ప్రశ్నించారు. పోలవరం పెండింగ్ బిల్లులు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ఈడీ, ఐటీ దాడులతో…