Posani Krishna Murali Challenges Pawan Kalyan Over Volunteers Comments: ఏపీ వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలు పవన్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. బేషరతుగా పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి కూడా పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏది చెప్తే, పవన్ కళ్యాణ్ అది చేస్తాడని విమర్శించారు. గతంలో సినిమా ఇండస్ట్రీ మహిళల మీద టీడీపీ నాయకులు బూతు వ్యాఖ్యలు చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గతంలో టీడీపీతో చేతులు కలపలేదని.. చిరంజీవిని, ఆయన ఇంట్లోని ఆడవాళ్లని దారుణంగా తిట్టించారని, ఆయన కన్నీళ్లు సైతం పెట్టుకున్నారని, అప్పుడు కూడా పవన్ నోరుమెదపలేదని ఫైరయ్యారు. టీడీపీ హయాంలో ప్రత్యేకహోదా కోసం సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు రాకపోతే.. ఘోరంగా తిట్లపురాణం సంధించారని, ఆ సమయంలోనూ పవన్ ముందుకు రాలేదని మండిపడ్డారు. చిరంజీవిని, సినిమా వాళ్లని తిట్టిన వాళ్లకు పవన్ మద్దతు ఇవ్వడం ఏంటి? అని నిలదీశారు.
Viral News: ఓరి నాయనో..రైలులో చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..
అసలు నీకు ట్రాఫికింగ్ అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నిస్తూ.. యూఎస్‌లో అమ్మాయిలతో నారాలోకేష్ సన్నిహితంగా దిగిన ఫోటోల్ని పోసాని కృష్ణమురళి చూపించారు. ట్రాఫికింగ్ అంటే ఇదేనని, ఇలాంటి నీచమైన పనులు మహిళా వాలంటీర్లు చేసినట్లు నువ్వు నిరూపించగలవా? అంత దమ్ముందా? అని సవాల్ విసిరారు. మహిళా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామారావు స్థాపించిన పార్టీని కబ్జా చేసి.. దాన్ని లాగేసుకోవడానికి అమ్మాయిల్ని పంపించారని.. ఈ విషయం పవన్‌కి తెలీదా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ తెలిసినప్పటికీ పవన్ మౌనంగానే ఉంటాడని అన్నారు. కేవలం సీఎం జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలన్న లక్ష్యంతోనే పవన్ పొలిటికల్ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. అసలు జగన్ ఏం పాపం చేశాడని ఆయన్ను విమర్శిస్తున్నావ్? అని అడిగారు. ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నారని ఆడపడుచులపై ఆరోపణలు చేసిన పవన్.. ఆ పని చేసిన కనీసం పది మంది పేర్లైనా చెప్పగలవా? అని ప్రశ్నించారు. తన ఇంట్లో ఆడవాళ్లను టీడీపీ వాళ్లు తిట్టారంటూ గతంలో బాధపడిన పవన్.. ఇప్పుడు అంతకంటే హీనంగా ప్రవర్తించాడని దుయ్యబట్టారు. వాలంటీర్లకు తల్లులు ఉండరా? నీ కామెంట్లు విని వాళ్లు ఇంట్లో ఏడవరా? నిజంగా ఇది సిగ్గుచేటు అంటూ పవన్‌పై ధ్వజమెత్తారు.
Traffic Challan: బైక్ లేదు.. కార్ డ్రైవ్ చేయలేదు.. అయినా ట్రాఫిక్ చలాన్.. ఇదేక్కడి విడ్డూరం సార్..
మొదట్లో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు తానే మొదటగా పవన్‌ని సాదరంగా స్వాగతించానని, ఆ పవన్ ఇప్పుడు లేడని పోసాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు విని, 24 గంటలూ జగన్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని ఫైరయ్యారు. విమర్శించినంత మాత్రాన ఎవరూ నాశనం అవ్వరని.. ప్రజల గుండెల్లో ఉన్నంతకాలం, ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఆ సీఎం సీట్లో తప్పకుండా ఉంటారని ఉద్ఘాటించారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి అలాగే ఉన్నారని, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు కాబట్టి, జీవితాంతం అలాగే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో, వాళ్లు నిన్ను పొరపాటున కూడా ముఖ్యమంత్రిని చెయ్యరని హితవు పలికారు. గత ఎన్నికల్లో పవన్ ఓడిపోవడానికి కారణం వైసీపీ కాదని, టీడీపీనే అని ఆరోపించారు. పవన్‌కి ఓట్లు వేయొద్దంటూ టీడీపీ వాళ్లు రూ.15 కోట్లు ఇచ్చారని, కావాలంటే ఎంక్వైరీ చేసుకోమని చెప్పారు. రాజకీయాల్లో ఎదగాలంటే.. జగన్‌పై ఉన్న పగ, కక్ష, ప్రతీకారాల్ని పక్కన పెట్టుకోవాలని పవన్‌కి సూచించారు. నిజంగానే మహిళలు మిస్సింగ్ అవుతారని కేంద్ర నిఘా వర్గాల వారికి తెలిస్తే.. ఈ సమాచారాన్ని వాళ్లు కేంద్ర ప్రభుత్వానికో, రాష్ట్ర ప్రభుత్వానికో తెలియజేస్తారని, పవన్ ఎవరని అతనికి ప్రత్యేకంగా సమాచారం ఇస్తారని ప్రశ్నించారు. పవన్ ఏమైనా కాబోయే ప్రధానినా? అని ఎద్దేవా చేశారు.
CM YS Jagan: కేబినెట్ భేటీలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలకు సిద్ధంకండి..
సరే.. పవన్‌కి నిజంగానే కేంద్ర నిఘా వర్గాలు ఆడవాళ్ల మిస్సింగ్ కేసుల వివరాలు తెలియజేస్తే, ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వెందుకు చేర్చలేదు? అని పోసాని అడిగారు. ఇవన్నీ నీకు సూటవ్వవని, కేవలం చంద్రబాబుకి మాత్రమే సూట్ అవుతాయని అన్నారు. ఎవరో మాటలు చెప్పి అబద్ధాలు చెప్పడం కాదని, పర్ఫెక్ట్‌గా ప్రతిపక్ష నాయకుడిగా ఎదగాలని, అప్పుడు కచ్ఛితంగా నీకు అవకాశం వస్తుందని సలహా ఇచ్చారు. చేపను పట్టుకోవడం కోసం ఒక సూదికి వానపాము గుచ్చినట్టు.. టీడీపీకి నువ్వు అలాంటివాడివేనని తూర్పారపట్టారు. పవన్‌పై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని, వారి వలలో పడొద్దని సూచించారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు అతనివి కావని, చంద్రబాబుకి చెందినవి అని, అందుకే అతను క్షమాపణలు చెప్పలేకపోతున్నాడని చెప్పుకొచ్చారు.