Viral News: ఓరి నాయనో..రైలులో చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు కత్తులు ఒక చోట ఉండలేవు.. అలాగే రెండు కొప్పులు ఒక చోట అస్సలు ఉండవు అనే సామెతను పెద్దలు ఊరికే అన్నారా.. ఇప్పుడు జరిగే కొన్ని గొడవలను చూస్తే అది నిజమనే అంటారు.. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆడవాళ్ల గొడవలకు సంబందించిన వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. అవి ఎంత ట్రెండ్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా కోల్‌కత్తా ట్రైన్‌లో మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులు తెగిపోయేలా కొట్టుకున్న దృశ్యాలు చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలు గుంపులుగా ఉన్న మహిళలు అరుపులు, కేకలు వేసుకుంటూ బీభత్సం చేశారు. చెప్పులు సహా చేతికి దొరికిన వస్తువులతో కొట్టుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు.. ఈ భీకర యుద్ధం ఎప్పుడూ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది..
ట్విట్టర్ లో వీడియో తెగ చక్కర్లు కొడుతుంది..ఆ వీడియోను చూస్తే అది రైలులో లేడీస్ కోచ్‌గా కనిపించింది. ఎందుకంటే అక్కడున్న వారంతా ఆడవాళ్లే ఉన్నారు. కానీ, ఏం జరిగిందో ఏమో..రెండు వర్గాలుగా విడిపోయిన మహిళలు పరస్పరం వీర కుమ్ముడు కుమ్మేసుకున్నారు. రైలు కంపార్ట్‌మెంట్‌ను యుద్ధభూమిగా మార్చేశారు. అక్కడే ఉన్న కొందరు మహిళలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొట్టుకుని అలిసిపోయిన మహిళలు వారికి వారిగానే యుద్ధాన్ని ముగించారు… కాసేపు రెస్ట్ కోసం గ్యాప్ ఇచ్చినట్లు ఉన్నారు..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వైరల్ వీడియో నెటిజన్లకు మాత్రం వినోదాన్ని పంచింది. పోస్ట్ చూసిన నెటిజన్లు మహిళల ముష్టి యుద్ధంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు… ఇంట్లో అత్తల భాధితులే ఉన్నారు కాబోలు.. ఇలా పగ తీర్చుకున్నారు.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో అయితే హల్ చల్ చేస్తుంది.. మొన్నీమధ్య కూడా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. మీరే ఓ లుక్ వేసుకోండి..
Kolkata local🙂 pic.twitter.com/fZDjsJm93L
— Ayushi (@Ayushihihaha) July 11, 2023
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!