అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల బృందంతో సీఎం సమావేశం అయ్యారు. CM Chandrababu: ప్రజా సేవ, ప్రచారం రెండూ ముఖ్యమే.. తెలుగు తమ్ముళ్లకు సీఎం దిశానిర్ధేశం.. వైద్యరంగంలో నూతన…
CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నేడు కీలక రాజకీయ వేడుకలకు వేదికైంది. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు సీఎం వద్ద వినతులు ఇవ్వడంతో కార్యాలయం సందడిగా మారింది. సీఎం చంద్రబాబు మంత్రులు, జిల్లాల త్రిసభ్య కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల నియామకంపై కమిటీ కాలయాపన పట్ల…
Satya Kumar Yadav: రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభమైన సుపరిపాలన యాత్రలో శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. వాజపేయి పాలన భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేసిందని, ఆయన చూపిన దిశలోనే నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని ఈ సందర్బంగా ఆయన అన్నారు. వాజపేయి నాయకత్వం దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపినదే కాకుండా, జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, ఐటీ, టెలికాం కనెక్టివిటీ వంటి కీలక రంగాలలో విప్లవాత్మక…
CM Chandrababu: అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన మీడియా సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, విభజన ప్రభావాలు, పరిశ్రమల పురోగతి, వ్యవసాయ సవాళ్లు, నేరాల నియంత్రణ, అలాగే ఇటీవల చోటుచేసుకున్న వివాదాస్పద సంఘటనలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన ప్రభావం ఇంకా కొనసాగుతుందని అంటూ.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ కు వ్యవస్థీకృతంగా ఇబ్బందులు వచ్చాయని, 25 ఏళ్ల క్రితం తెలంగాణాలో అమలైన పాలసీలు ఆ రాష్ట్రానికి ఇప్పుడు ఆదాయం అందిస్తున్నాయని వ్యాఖ్యానించారు.…
CM Chandrababu : రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఖనిజ వనరులను సమర్థంగా వినియోగించడం, అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టడం, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల లభ్యత, విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి కీలక అంశాలపై ఆయన అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. సీఎం మాట్లాడుతూ విశాఖపట్టణంలో పరిశ్రమలు వేగంగా వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రను మెటల్ ఆధారిత…
Botsa Satyanarayana : ఏలూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై వరుస ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తై రెండేళ్లుగా అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే తాము నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడానికి…
Perni Nani : కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. మనుషులను ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబుకు సరితూగే వ్యక్తి లేరని విమర్శించారు. కొనుగోలుదారులను సిద్ధం చేసి, బయానాలు…
అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వ్యయం తగ్గింపు, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్‌టాప్ వంటి పథకాల పురోగతిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు…
ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల రంగంలో ప్రభుత్వ మార్పు తర్వాత వేగవంతమైన పనులు ప్రారంభమయ్యాయని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు పూర్తవుతుండగానే సాగునీటి ఎన్నికలు నిర్వహించడం తమ ప్రభుత్వ దృఢ నిశ్చయానికి నిదర్శనమన్నారు. మంత్రి రామానాయుడు విమర్శిస్తూ, గత జగన్ ప్రభుత్వం సమయంలో పులిచింతల, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు వరదల్లో కొట్టుకుపోయినా సరైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి 17 నెలల్లోనే ప్రాజెక్టుల…
CM Chandrababu: అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు వస్తాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఒకప్పుడు హైదరాబాద్‌లోని కోకాపేటలో రూ.10,000 విలువ చేసే ఎకరం భూమి… ఇప్పుడు రూ.170 కోట్లకు చేరిందని గుర్తు చేశారు.. జూబ్లీహిల్స్‌లో ఒక్కప్పుడు రాళ్లు, రప్పలు ఉండేవి.. కానీ, ఒక హైటెక్ సిటీ కట్టి.. ముందు అడుగు వేశాం.. మౌలిక సదుపాయాలు కల్పించాం.. ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే.. ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు.. అభివృద్ధి…