Traffic Challan: బైక్ లేదు.. కార్ డ్రైవ్ చేయలేదు.. అయినా ట్రాఫిక్ చలాన్.. ఇదేక్కడి విడ్డూరం సార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెహికిల్స్ కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, బైక్ మీద వెళ్లేవారు అయితే హెల్మెట్, కారులో వెళ్లేవారు అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలనే రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే రోడ్డు మీద ఏ ట్రాఫిక్ పోలీస్ మన వాహనాన్ని ఆపినా.. సంబంధిత పత్రాలు చూపించి రయ్ మని వెళ్లొచ్చు. ఇక ఇందులో ఏ ఒక్కటీ లేకపోయినా ట్రాఫిక్ పోలీసులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బైక్ లేకపోయినా.. కారు నడపకూండనే ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు. అది చూసి ఆమె ఖంగుతిన్నారు. ఇదేం విచిత్రమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Internet Apocalypse: రెండేళ్లలో “సోలార్ మాగ్జిమమ్”కి సూర్యుడు.. ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసం అవుతుందా..?
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
గ్రేటర్ నోయిడాలోని హోషియార్ పూర్ పరిధిలో నివసించే శైలజా చౌదరీ అనే మహిళకు గత శుక్రవారం ఒక ఈ- చలాన్ వచ్చింది. ఆమెకు జూన్ 27 వ తేదీన గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చలానా వేసినట్లు.. తన బైక్ కి రూ. 1000 జరిమానా విధించారు.. కానీ.. తన పేరు మీద అసలు ఎలాంటి బైక్ రిజిస్టర్ అయి లేదని శైలజా చౌదరీ తెలిపారు. తనకు కారు మాత్రమే ఉందని.. ఆ రోజు కారులో హోషియార్ పూర్ ప్రాంతంలో ప్రయాణించ లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. అసలు తనకు బైకే లేకుండా.. కారులో ప్రయాణించకుండా ఎలా చలానా వేస్తారని ట్రాఫిక్ పోలీసులను ఆమె ప్రశ్నించింది.
Read Also: CM YS Jagan: కేబినెట్ భేటీలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలకు సిద్ధంకండి..
తన పేరు మీద కేవలం హ్యూందాయ్ ఐ20 కారు మాత్రమే ఉందని.. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ చలాన్ వేశారని శైలజా చౌదరీ ఆరోపించారు. వెంటనే దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రీతీ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ట్రాఫిక్ చలానాలు వేసేందుకు తాము ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉపయోగిస్తామన్నారు.. దీని ద్వారా ఆటోమెటిక్‌గా వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తిస్తుందన్నారు. అలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాటుల వల్ల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పుగా డిటెక్ట్ చేస్తుందని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. తప్పుగా ఉన్న చలానాలను తొలగిస్తామని ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!