ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరు ఏమి చేసినా తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఏపీలో జలయజ్ఞం పేరిట 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు అన్నీ నేనే చేశా అంటారు.. పోలవరం నాదే అంటారు.. హంద్రీనీవా నాదే అంటారు.. ఆయనకు ఉన్న మీడియా బలంతో అన్నీ నిజాలే అన్నట్లుగా చెప్పేసుకుంటాడని అంబటి రాంబాబు ఆరోపించారు. ఏ ప్రాజెక్టు అయినా వైఎస్ఆర్ శ్రద్ధతోనే వచ్చాయని తెలిపారు. వైఎస్ తర్వాత తిరిగి ఆయన తనయుడు జగన్ సీఎం అయిన తర్వాత మళ్ళీ పనులు మొదలు పెట్టారని అన్నారు.
గోదావరి, బనకచర్ల మూడు దశల్లో పూర్తి చేయాలనుకున్న మొదటి వ్యక్తి జగన్.. 280 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణకు తరలించేలా ప్రయత్నం చేసిన జగన్ అని అంబటి రాంబాబు చెప్పారు.
2024 Rewind: ఈ ఏడాది అరెస్టై జైలుకెళ్లిన సినీ, రాజకీయ ప్రముఖులు వీళ్లే!
వైకుంఠపురం నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లి దగ్గర కలిసేలా పనులు.. దశల వారీగా సత్తెనపల్లి నియోజకవర్గం నరసింగపాడు దగ్గర కలిపేలా ప్రణాళిక.. బొల్లాపల్లి దగ్గర 150 టీఎంసీలతో రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని అంచనాలు ఉండేవని అంబటి రాంబాబు తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం అన్నీ తానే చేశా అని ముందుకు వచ్చారన్నారు. వారి ఆలోచనలే పెద్ద గేమ్ చేంజర్ అని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. బొల్లాపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలకు చేరితే వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన నల్లమల సాగర్ నీరు తరలించాలని ప్రణాళిక ఉందని అన్నారు. నల్లమల సాగర్ నుంచి బనకచర్ల వరకు 23 కిలోమీటర్ల టన్నెల్ తవ్వి పనులు చేయాలని అంచనాలు వేశాం.. గతంలో తమ ప్రణాళికలు అన్నీ కార్యరూపం దాల్చితే గోదావరి నుంచి వృధాగా వెళ్ళే జలాలు కృష్ణా నదిలోకి వెళ్తాయని చెప్పారు. ఈ అనుసంధానంతో వెనుకబడిన ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలు సస్య శ్యామలం అవుతాయని అంబటి పేర్కొన్నారు. 2022లో దీనికి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్రానికి పంపాం.. కేంద్ర అనుమతులు కోసం వేచి ఉన్నాం.. ఈ ప్రణాళికలను మొత్తం ఇవాళ చంద్రబాబు అన్నీ నేనే చేసానని చెప్పుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
Online Love: సరిహద్దు దాటిన ప్రేమ.. లవర్ కోసం పాకిస్తాన్ వెళ్లిన వ్యక్తి అరెస్ట్..
తెలుగుతల్లి జలహారతి అని పేరు కూడా పెట్టారు.. అన్నీ తన వారికే ఇవ్వాలని చంద్రబాబు యత్నం.. అన్నింటికీ కేంద్రం సుముఖత అన్న ప్రచారం.. కేంద్రమే ఇస్తే తాము ఉన్నప్పుడే చేసే వాళ్ళం కదా అని అంబటి రాంబాబు తెలిపారు. ప్రచార ఆర్భాటాలు తప్ప చేస్తున్న పనులు మాత్రం లేవని అన్నారు. ఆఖరికి రైతులను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు.. నీటి ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేస్తామనటం తానెప్పుడూ వినలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు లేరు కానీ.. ఉంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేవాళ్ళని విమర్శించారు.
ప్రతీ ఒక్కరూ చంద్రబాబు చెప్తున్న విషయాలు గమనించాలి.. దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అని కొత్తగా కనిపెట్టిందేమీ లేదన్నారు. రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లకు వెళ్లిన వ్యక్తి.. ఆయన ఆస్తులు ఎలా పెంచుకున్నారో అందరూ చూసారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఏడు నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.