నా మామిడితోట ఎక్కడుందో చెప్పండి
బిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి వాది మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బిఆర్ఎస్ నేతలకు మధ్య మామిడి తోట వివాదం కొనసాగుతుంది. అయితే ఆ మామిడి తోట వివాదానికి పొంగులేటి పుల్ స్టాఫ్ పెట్టారు. మామిడి తోట ఎక్కడుందో చెప్పండి అంటూ సవాల్ కూడా విసిరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నియోజకవర్గాల వారీగా అసంతృప్తి సమావేశాలను ఆత్మీయ సమావేశాల పేరుతో పెడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తన వర్గం అభ్యర్ధులను కూడా ప్రకటించేస్తున్నారు. దీంతో పోటీ గా అన్నినియోజకవర్గాల్లో అభ్యర్ధులను పెడతారని స్పష్టం అయ్యింది. అయితే భవిష్యత్ లో తాను ఏ పార్టీలో ఉన్నప్పటికి ఈ టీమ్ ఉంటుందని ఆయన చెబుతున్నారు. అయితే ఆత్మీయ సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ 24 గంటల విద్యుత్ రావడం లేదని తెలంగాణ వచ్చినప్పటికి ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదని అంటున్నారు. ఈ సందర్బంగా పంటలు ఎండిపోయి రైతులు ఇక్కట్లు పడుతున్నారని ప్రభుత్వంపై విమర్శానాస్ర్టాలను ఎక్కుపెడుతున్నారు. అయితే కరెంటు ఎక్కడ రావడం లేదో చెప్పాలని బిఆర్ఎస్ నేతలు కూడ పొంగులేటికి ధీటుగా సమాదానాలను ఇస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని పొంగులేటి అంటున్నారని ఆయన స్వంత గ్రామం నారాయణ పురంలో నలభై ఎకరాల మామిడి తోటలకు నీళ్లు అందుతున్నది నిజం కాదా అంటూ పదే పదే పొంగులేటిని ఉద్దేశించి బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
పురానాపూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 6 ఫైర్ ఇంజన్లు
హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో ఉండే ఓ గోదాములో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో, ఆరు ఫైరింజన్లను రంగంలోకి దింపారు. ఈ గోదాములో ఎక్కువగా ప్లాస్టిక్ సామాగ్రి ఉండటంతో.. దట్టమైన పొగతో పాటు మంటలు కూడా ఎగసిపడుతున్నాయి. ఈ మంటల ధాటికి గోదాము పైకప్పి కూలిపోయింది. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది గోదాము పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. ఈ ఘటనపై డీఆర్ఎఫ్ చీఫ్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. మంటలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది మొత్తం వీల్ చైర్‌లు తయారు చేసే గోదాము అని, గోదాము చుట్టూ ఉన్న గోడలని కూల్చివేస్తున్నామని అన్నారు. ఇప్పటికే మంటల ధాటికి పైనున్న రేకులు కూలిపోయాయని తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం గానీ, గాయాలు అవ్వడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం షార్ట్ సర్య్కూట్ వల్ల జరిగిందా? లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మంటల్ని అదుపు చేసిన అనంతరం.. ఈ ఘటనకు గల కారణాలేంటన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు. పైకప్పు కూలడం వల్ల మంటలు ఆర్పడం కష్టంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా.. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంటారు. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
నిధులిస్తామని చెప్పి ప్రజలకు శఠగోపం పెట్టిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి ధ్వజమెత్తారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలని కేసీఆర్ చెప్పారని, మరి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఇప్పుడున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లన్ననీ అగ్గిపెట్టేలా చిన్నగా ఉన్నాయని విమర్శించారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యను ప్రజలలోకి తీసుకెళ్లిందుకే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. 609వ నంలో ఉన్న అదానిని.. ప్రపంచంలో 9 స్థానానికి బీజేపీ తీసుకొచ్చిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాకముందు ఉన్న అప్పు ఎంత? ఇపుడున్న అప్పు ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్టు.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ లేదని, 10 గంటలే వస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ తీగలను పట్టుకోమన్న టీఆర్ఎస్ ఛాలెంజ్‌ని తాము స్వాగతిస్తున్నామని, కరెంట్ తీగల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు అనేక వేధింపులకు గురవుతున్నారన్నారు. వారిపై అక్రమ కేసులు పెట్టి, బైండోవర్లు చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వంత జాగీరేమీ కాదని తేల్చి చెప్పారు. శ్రీరామ్ సాగర ప్రాజెక్ట్ నీళ్లు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు ఎలా పంపిస్తావని కేసీఆర్‌ని ప్రశ్నించిన ఆయన.. శ్రీరామ్ సాగర్‌లో చుక్క నీరు ముట్టినా రక్తపు మరకలేనంటూ వార్నింగ్ ఇచ్చారు. దేవాలయాలకు నిధులు కేటాయిస్తానని చెప్పి.. దేవుళ్ళకు, ప్రజలకు శఠగోపం పెట్టారన్నారు. కొండగట్టులో బస్ ప్రమాదం జరిగితే.. బాధితుల్ని పరామర్శించేందుకు కేసీఆర్ రాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఛార్జ్ షీట్ చేసి.. ఎన్నికల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
వీడిన హత్యకేసు మిస్టరీ.. నిందితులు ఎవరంటే?
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లి అటవీ ప్రాంతంలో బత్తుల దేవదరణి (22) అనే యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టిన దుండగులు ఈనెల 2వ తేదీ తెల్లవారు జామున ఘటన జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన యువకుడుగా గుర్తించారు పోలీసులు. విశాఖపట్నం లోని లాడ్జ్ అండ్ రెస్టారెంట్ లో మేనేజర్ గా పని చేస్తున్న బత్తుల దేవ ధరణి (22)ను ఈ నెల 1 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కర్నూలు జిల్లా నుండి తనను కలవడానికి ఎవరో వస్తున్నారని చెప్పి బయటికి వెళ్ళిన కొంత సేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండగా తన తమ్ముడిని వెతకగా ఎక్కడ అతని ఆచూకీ దొరకలేదు.ఈ విషయమై విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వప్న అనే ఒక అమ్మాయి కాల్ చేసి ఆర్కే బీచ్ కు రమ్మనట్టు, ఆర్కే బీచ్ లో ఎవర్నో కలవడానికి కలుసుకోవడానికి వెళ్ళగా ఒక కారులో అతనిని తీసుకు పోయినట్టు తెలిసింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం రాగిరి ప్రవీణ్ కు గంగ అనే అమ్మాయి ప్రియురాలు ఉంది, ప్రస్తుతం ఆ గంగ అనే అమ్మాయి బత్తుల దేవ ధరణితో చనువుగా ఉండటంతో ప్రవీణ్ అతని కొంతమంది స్నేహితులతో కలిసి రాగిరి ప్రవీణ్ కుమార్,మనోజ్,సురేష్, పగిడి శివ కిరణ్,రాగిరీ చాణక్య సాయముతో హత్య చేసినట్టు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి వచ్చినవారికి వెరైటీ గిఫ్ట్ … అదేంటో తెలుసా?
పెళ్లంటే సందడే సందడి.. బంధుమిత్రులు, పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తరఫు బంధువులతో వివాహ వేడుక కళకళలాడుతుంది. మూడు ముళ్లు, ఏడడుగులు… కానీ వాటి వెనుక పరమార్థం ఏంటో చాలా కొద్దిమందికే తెలుసు. పెళ్లిళ్ళకు ఖరీదైన గిఫ్ట్ లు కొత్త దంపతులకు ఇవ్వడం ఆనవాయితీ. కానీ పెళ్లికి వచ్చిన వారికి మంచి బహుమతి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆ దంపతులు. ఆ పెళ్లి వేడుక – పచ్చని కానుకలతో నిండిపోయింది. తమ పెళ్ళికి వచ్చి, తమకు ఆశీర్వచనం ఇచ్చిన బంధుమిత్రులకు మొక్కలు పంపిణీ చేశారు వధూవరులు. కొత్తగా పెళ్లయిన ఆ జంట ప్రకృతిపై దృష్టి పెట్టారు.వందలాది మొక్కలను పంపిణీ చేసారు.వివాహాది శుభకార్యాలకు వచ్చే బంధుమిత్రులకు రకరకాల గిఫ్ట్‌లు ఇవ్వడం మనకు తెలిసిందే. అయితే వీరు పచ్చని మొక్కలను ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన ఈడుపుగంటి భూపయ్య చౌదరి కుమార్తె శ్రీలక్ష్మి కావ్య,ధీరజ్ కృష్ణ చైతన్యల వివాహ రిసెప్షన్ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను అందజేశారు. ఈ మొక్కలను తీసుకెళ్లడానికి ప్రత్యేక ప్యాకింగ్ కూడా చేయించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి ఈ మొక్కను అందుకోవడం అందరినీ ఆకట్టుకుంది
జగన్ పాలనలో దళితులు, గిరిజనులకు అన్యాయం
ఏపీలో జగన్ పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి మారెప్ప. కుతుహులమ్మ మృతికి సంతాపం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన నిధులను జగన్మోహన్ రెడ్డి దారిమళ్ళిస్తున్నారు. దళిత ఉద్యోగులను కూడా ఏపీలో వేధిస్తున్నారు. దళిత గిరిజన కార్పొరేషన్ లకు నిధులు లేవు. గతంలో జీవో వన్ లాంటి జీవో లు ఉండుంటే నీవు ప్రజల్లో తిరిగి ఉండేవాడివా జగన్. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేశాడు జగన్ అని మారెప్ప విమర్శించారు. మూడు రాజధానులు అంటున్న ముఖ్యమంత్రి తనతో పాటు విజయ సాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లకు సీఎం పదవులు ఇస్తాడా? ఏపీ లో ప్రస్తుతం జగన్ పోవాలి పోవాలి అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు ఢిల్లీ లోని ఏపీ భవన్ లోనూ దళితులకు తీవ్ర అవమానం జరుగుతుంది. మాజీ మంత్రి అయిన నన్ను కూడా తీవ్రంగా అవమానించారని మారెప్ప విమర్శించారు.
టాస్ గెలిచిన వెస్టిండీస్.. టీమిండియా బౌలింగ్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను మట్టికరిపించిన హర్మన్‌సేన అదే జోరుతో రెండో మ్యాచ్‌కు రెఢీ అయింది. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ రేసులో మరింత ముందంజ వేయాలని భారత జట్టు భావిస్తోంది. విమెన్స్ ఐపీఎల్ వేలంలో కాసుల వర్షంతో సంతోషంలో ఉన్న మహిళా క్రికెటర్లు ఈ ఊపును ఈ మ్యాచ్‌లో కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఇక తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన విండీస్ ఎలాగైనా ఈ పోరులో గెలవాలన్న పట్టులదతో ఉంది. దీంతో ఇరుజట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో ఆడుతోంది. పాక్‌పై కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించి విజయం సాధించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. పైగా ఆ మ్యాచ్‌కు గాయం కారణంగా అందుబాటులో లేని స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా.. విండీస్‌పై బరిలోకి దిగనుంది. మరోవైపు విండీస్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ జట్టుపై హర్మన్‌ప్రీత్ సేనకు మంచి రికార్డే ఉంది. ప్రస్తుతం భారత్ జోరు ముందు విండీస్ నిలవడం కష్టమే. పాక్‌పై చెలరేగి ఆడిన జెమీమా, రిచాలపై మంచి అంచనాలున్నాయి. స్మృతి రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది.
చాలా రోజుల తర్వాత కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఇది కోహ్లీకి ఓనమాలు నేర్పిన మైదానం కావడం విశేషం. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు రోజులు ఉందనగా కోహ్లీ ఒక ఎమోషనల్ పోస్టుతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియానికి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. “చాలా కాలం తరువాత ఢిల్లీ స్టేడియంలోకి లాంగ్ డ్రైవ్.. నోస్టాల్జిక్ ఫీలింగ్..” అని క్యాప్షన్ ఇచ్చాడు. కోహ్లీ చివరిసారిగా ఆరేళ్ల క్రితం ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన కోహ్లీ.. 2017లో అనుష్క శర్మను పెళ్లాడిన తరువాత మకాం ముంబైకి మార్చాడు. ఢిల్లీలో టెస్ట్ మ్యాచ్ ఆడిన ఏడాది కూడా అదే కావడం యాధృచ్చికం. ఈ స్టేడియంలో కోహ్లీకి అన్ని తీపి గుర్తులే. ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లో కోహ్లీ 467 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం కోహ్లీ ఇక్కడ తొలి టెస్ట్ ఆడాడు. అప్పుడు కూడా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు.