హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. కారులోనే సెక్యూరీటి గార్డ్ సజీవ దహనం
స్వప్రలోక్ ఘటన మరువక ముందే.. హైదరాబాద్ అబిడ్స్‌లో మరో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే వున్న కారు మెకానిక్ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఆమంటలు గ్యారేజీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయభ్రాంతులైన కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తీగా అదుపుచేశారు. ఈప్రమాదంలో దాదాపు ఐదు కార్లు దగ్ధమయ్యాయి. ఐదుకార్లలో ఒకకారులో సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయాడు. అందులో కూడా మంటలు అంటుకోవడంతో సెక్యూరిటీ గార్డ్ మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. కారులో సజీవ దహనమైన సెక్యూరిటీ గార్డ్ సంతోష్ గా గుర్తించారు పోలీసులు. ఈ సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. సెక్యూరిటీ గార్డ్ సంతోష్ కు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రెండో రోజు రేవంత్ ఇంటిచుట్టూ బందోబస్తు.. ఓయూ క్యాంపస్ లో హై అలెర్ట్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నిన్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా రేవంత్ ఇట్టి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న, నేడు నిరుద్యోగ నిరసనకు పిలుపు నివ్వడంతో రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. నిన్న ఓయూ దీక్షకు వెళ్లేందుకు సిద్దమైన రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరికి అనుమతించడంలేదు. రేవంత్ ఇంటి వైపు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఎవరిని అనుమతించడంలేదు. రేవంత్ ఇంటి దగ్గర రెండు అంచల పటిష్ట భద్రత, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ కూడా నిరుద్యోగ నిసరనకు పిలుపు రెండోరోజు కావడంతో.. రేవంత్ రెడ్డిని ఇంటిని బయటకు కదలకుండా.. హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే నిన్న కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ను హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..
బాల్యవివాహం కలకలం.. సాయిబాబా గుట్టు రట్టు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కంకోల్‌కు చెందిన సాయిబాబా (34) అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కోవెలకుంట్లకు వెళ్తున్న సమయంలో అతని కన్ను 13 ఏళ్ల బాలికపై పడింది. దీంతో.. ఆ బాలికకు మాయమాటలు చెప్పి, పెళ్లికి ఒప్పించాడు. అహోబిలంకు తీసుకెళ్లి, ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట చక్కర్లు కొడుతూ.. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) అధికారుల చెవిన పడింది. దీంతో వాళ్లు రంగంలోకి దిగి, పక్కా సమాచారాన్ని సేకరించారు. ఆ వ్యక్తి వివరాలతో పాటు పెళ్లికి సంబంధించిన వివరాల్ని సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు.. సాయిబాబాతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుని విచారిస్తున్నారు.
Read also: Tata Water : బిస్లరీ మార్కెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు టాటా గ్రూప్ ప్లాన్
రాహుల్ గాంధీ శిక్షపై ఇండో-అమెరికన్ పొలిటీషియన్..
రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై పలువురు విదేశీ ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. తాజాగా యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు భారత-అమెరికా సంతతి నేత రో ఖన్నా స్పందించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించడం గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని, ఇది భారతీయ విలువలకు తీవ్రమైన ద్రోహం అని ట్వీట్ చేశాడు. రోఖన్నా యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటివ్స్ లో సిలికాన్ వ్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మా తాత ఏళ్ల తరబడి జైలు జీవితాన్ని త్యాగం చేసింది దీని కోసం కాదని రోఖన్నా అన్నారు. భారతదేశం, ఇండో-అమెరికన్ కాంగ్రెషనల్ కాకస్ కో-చైర్మన్ గా ఉన్న రోఖన్నా ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ జోక్యాన్ని కోరారు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..
యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనం వీడారు. యూకేకు బుద్ధి వచ్చే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు, ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా, భారత్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రాయబార కార్యాలయంపై దాడి చేసి భారత జెండాను అవమానపరిచారు.
ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్.. విచారణకు ఆదేశం..
రాజస్థాన్ జైసల్మేర్ లోని పోఖ్రాన్ వద్ద ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. ఆర్మీ యూనిట్ ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తుండగా మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. భారత ఆర్మీ చెబుతున్నదాని ప్రకారం క్షిపణి విమానంలో పేలింది. పోఖ్రాన్ రేంజ్ లో ఈ ఘటన జరిగింది. క్షిపణి విమానంలో ఉండగా పేలింది. శిథిలాలు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పడిపోయాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆర్మీ తెలిపింది. దీనిపై విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేశారు. ఈ కేసులో మహిళ పెంపుడు కుక్క కూడా చనిపోయింది. యజమాని తన కొడుకుతో కలిసి పెళ్లికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి తన భార్య, కుక్క మృత్యువాత పడడం చూసి షాక్ అయ్యాడు. ఈ కేసులో తొమ్మిదేళ్ల తర్వాత ఢిల్లీ సెషన్స్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. మొదట్లో ఈ కేసు నిలబడేందుకు సరైన ఆధారాల్లేక తొమ్మిదేళ్లుగా సాగుతూ వచ్చింది. చివరకు కేసు ఎలా నిలబడింది అనేది ఆసక్తికరం.
బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం.. ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు..
కర్ణాటక ఎన్నికల ముందు అక్కడి అధికార బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచింది. ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ముస్లింలు 10 శాతం ఆర్థికంగా బలహీన విభాగం(ఈడబ్ల్యూఎస్) కేటగిరిలో రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. ముస్లింల 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగా, లింగాయత్ లకు ఇవ్వనున్నారు. ఎన్నికలు మరో నెలలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కేటాయింపులను తీసివేసి, రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. దీనికి ముందు జరిగిన క్యాబినెట్ సమావేశంలో రిజర్వేషన్లను 50 నుంచి 56 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ 10 శాతం కేటగిరిలో బ్రహ్మణులు, వైశ్యులు, ముదలియార్లు, జైనులు వర్గాల్లాగనే రిజర్వేషన్లు పొందనున్నారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం బొమ్మై మతపరమైన మైనారిటీల కోటాను రద్దు చేసి ఎలాంటి షరతులు లేకుండా ఈడబ్ల్యూఎస్ కిందికి తీసుకువస్తామని ప్రకటించారు.
భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం..
భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో గార్సెట్టి నామినేషన్ ను యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది. భారత్ లో గత రెండు సంవత్సరాలుగా అమెరికా రాయబారి నియామకం ఖాళీగా ఉంది. తాజాగా గార్సెట్టితో ఈ స్థానం భర్తీ కాబోతోంది. నేను సేవ చేయడానికి సిద్ధంగా వేచి ఉన్నానని గార్సెట్టి తన నియామకం గురించి మాట్లాడారు. ఈ ప్రమాణ స్వీకారానికి భార్య అమీ వేక్‌ల్యాండ్, తండ్రి గిల్ గార్సెట్టి, తల్లి సుకీ గార్సెట్టి, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
పాకిస్తాన్ దుస్థితి.. ఎన్నికల నిర్వహణకు కూడా డబ్బుల్లేవు..
పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ధరలు దారుణంగా పెరిగాయి. ఇక ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీని పొందేందుకు ఇబ్బదిముబ్బడిగా పన్నులను పెంచింది. దీంతో అక్కడ విద్యుత్, పెట్రోల్ రేట్లు పెరిగాయి. గతంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిందని వ్యాఖ్యానించాడు. తాజాగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ వద్ద డబ్బుల్లేవని వెల్లడించారు.
బిస్లరీ మార్కెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు టాటా గ్రూప్ ప్లాన్
బాటిల్ వాటర్ మార్కెట్లో సంచలనం సృష్టించే దిశగా టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. బిస్లరీతో ఒప్పందం విఫలమవడంతో, టాటా గ్రూప్ సొంతంగానే మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. ప్రస్తుతం భారతదేశంలోని బాటిల్ వాటర్ వ్యాపారంలో బిస్లరీ ఆధిపత్యం చెలాయిస్తోంది. బిస్లరీకి ప్రస్తుతం ప్రధాన పోటీదారు లేడు. బిస్లరీ గ్రూప్‌ను కొనుగోలు చేసే చర్చలు విఫలమయ్యాయి. టాటా గ్రూప్ ఇప్పుడు బాటిల్ వాటర్ మార్కెట్‌లో ప్రధాన వాటాను స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ఈ బృందం గట్టి ప్రణాళికను సిద్ధం చేసింది.
పెళ్లి ఊరేగింపులో కాల్పులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
మహారాష్ట్రలోని పటాన్ తాలూకా తలమావెల్లే వద్ద పెళ్లి ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో ధేబెవాడి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. అతని నుండి లైసెన్స్ పొందిన 12 బోర్ రైఫిల్.. 10 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం జరగ్గా, గత ఐదు రోజుల్లో మూడోసారి కాల్పులు జరగడం జిల్లాలో చర్చనీయాంశమైంది. పటాన్ తాలూకాలోని తలమావే గ్రామంలోని కాకాసాహెబ్ చవాన్ కాలేజీ గేటు ముందు జితేంద్ర జగన్నాథ్ కొలేకర్ అనే వ్యక్తి తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పటాన్ డీవైఎస్పీ వివేక్ లావంద్, ధేబెవాడి అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అభిజిత్ చౌదరి ఘటనా స్థలాన్ని సందర్శించారు.
యజమానిని చంపిన వాళ్లను పట్టించిన చిలుక
ఫిబ్రవరి 20, 2014న ఆగ్రాకు చెందిన విజయ్ శర్మ తన కుమారుడితో కలిసి వివాహ నిమిత్తం ఫిరోజాబాద్‌కు వెళ్లాడు. అర్థరాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య నీలం మృతదేహం కనిపించింది. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సమీపంలో వారి పెంపుడు కుక్క కూడా చనిపోయి పడి ఉంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టంలో మహిళ శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. కుక్కను 9 సార్లు పొడిచారు. పోలీసులు కేసును ఛేదించేందుకు ప్రయత్నించినా ఎలాంటి క్లూ లభించలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా బోనులో ఉన్న చిలుక ఏదో చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ చిలుక గద్గద స్వరాన్ని పోలీసులు అనుసరించారు. చిలుక సరిగ్గా ఏమి మాట్లాడుతుందోనని పోలీసులు అనుమానించారు. వాళ్లు సావధానంగా వింటున్నప్పుడు అతడు పోలీసులకు.. ‘ఆషు ఆయ థా’.. ‘ఆషు ఆయ థా’ అని చెబుతున్నాడు. ఈ ఆశు ఎవరు అని ఆరా తీస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది.
Read also: MS Dhoni : బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మిస్టర్ కూల్.. ఈసారి కప్పు ముఖ్యం బిగిలు
బాలీవుడ్ బడా నిర్మాతతో తారక్ సినిమా.. ఇదే సాక్ష్యం!
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ. ఎన్టీఆర్ క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది. ఆ సినిమాకి ముందు రీజనల్ హీరోగా ఉన్న తారక్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా అవతరించాడు. దీంతో.. ఈ నటుడితో సినిమాలు చేసేందుకు ఇప్పుడు బడా నిర్మాణ సంస్థలు ఎగబడుతున్నాయి. తారక్ డేట్స్ కోసం క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్‌కి చెందిన ఓ పెద్ద నిర్మాణ సంస్థ అతనితో ఓ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకీ ఆ సంస్థ ఏది? అని అనుకుంటున్నారా! మరేదో కాదు.. టీ-సిరీస్ ఫిల్మ్స్! NTR30 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ అధిపతి భూషణ్ కుమార్ తళుక్కుమనడం వల్లే.. ఈ ప్రచారం పుట్టుకొచ్చింది.
షూటింగ్‌లో అక్షయ్ కుమార్‌కి గాయాలు
సాధారణంగా కథానాయకులు డేంజరస్ స్టంట్స్‌లో నటించరు. ఏదైనా ప్రమాదం సంభవించొచ్చన్న భయంతో.. డూప్స్‌తో ఆయా స్టంట్స్ చేయిస్తారు. అయితే.. ఈమధ్యకాలంలో సహజత్వం లోపించకుండా ఉండేందుకు స్వయంగా హీరోలే రంగంలోకి దిగుతున్నారు. ఎలాంటి స్టంట్స్ చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఇక బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అయితే.. ఇలాంటి యాక్షన్ సీన్స్‌లో నటించడానికి ఎప్పుడూ ముందుంటాడు. అఫ్‌కోర్స్.. అతడు స్టంట్స్ చేయడంలో దిట్ట. తాను స్టంట్స్ చేసే హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు. ఇప్పటికీ.. ఛాలెంజింగ్‌గా తీసుకొని, డేంజరస్ స్టంట్స్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తున్న బడే మియా ఛోటే మియా సినిమాలోనూ తానే స్వయంగా యాక్షన్ స్టంట్స్‌లలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు తాజాగా గాయాలపాలయ్యాడని సమాచారం. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం స్కాట్‌లాండ్‌లో జరుగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు.. అక్షక్ కాలికి గాయాలయ్యాయి. అయితే.. ఇది తీవ్రమైన గాయం కాదని, దాంతో అతడు ఆ గాయంతోనే షూటింగ్ కొనసాగించాడని యూనిట్ సభ్యులు వెల్లడించారు.
Read also: S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..
బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మిస్టర్ కూల్.. ఈసారి కప్పు ముఖ్యం బిగిలు
మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2023 కొత్త సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్లేయర్స్.. ప్రాక్టీస్ కూడా ప్రారంభించేశారు. నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ చూసిన ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఎందుకంటే అతను ఈ సారి ప్రాక్టీస్ సెషల్ లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో అతను ఈ సీజన్ లో బౌలింగ్ కూడా చేయబోతున్నాడా అనే అనుమానం ఫ్యాన్స్ కు కలుగుతుంది. మరి ఈ సీజన్ లో అతుడు ఏం అద్బుతం చేయబోతున్నాడో అంటూ ధోనీ అభిమానులు అనుకుంటున్నారు. చెపాక్ స్టేడియంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఎంఎస్ ధోనీ అలరిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే ఫ్రాంఛైజీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
ముంబై చేతిలో చిత్తుగా ఓడిన యూపీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఫైనల్ చేరాలంటే తప్పకుండా ఆడాల్సిన మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు జూలు విదిల్చారు. గత మూడు మ్యాచ్ లలో విఫలమైన బ్యాటర్లంతా నిన్న( శుక్రవారం ) జరిగిన మ్యాచ్ లో ధాటిగా ఆడారు. ఓపెనర్లు యాస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ లు శుభారంభం అందించగా.. వన్ డౌన్ లో వచ్చిన నటాలీ సీవర్(38 బంతుల్లో 72 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (19 బంతుల్లో 25, 5 ఫోర్లు )లు చిత్తకొట్టారు. వీరి దూకుడుతో నిర్ణత 20 ఓవర్లలో ముంబై.. 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ముంబై నిర్థేశించిన 183 పరుగుల లక్ష్య ఛేధనలో యూపీ వారియర్స్ 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్ తో యూపీ పనిపట్టింది.
దంచికొట్టిన తమన్.. ఫైనల్ కు తెలుగు వారియర్స్..
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చివరి దశకు చేరుకుంది. శుక్రవారం సెమీ ఫైనల్స్ జరిగాయి. విశాఖపట్నంలోని పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హోరహరీగా సాగాయి. రెండో సెమీ ఫైనల్ లో తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పైనల్ కు దూసుకెళ్లింది. తెలుగు వారియర్స్ కు అఖిల్ అక్కినేని సారథ్యం వహించారు. కర్ణాటక బుల్డొజర్స్ కు ప్రదీప్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
సూరీడు మళ్లీ చెలరేగుతాడు.. వరల్డ్ కప్ లో అతనిదే కీలక పాత్ర..
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా తొలి రెండు మ్యాచ్ ల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ దెబ్బకు ఎల్బీగా సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మూడో వన్డేలో అష్టన్ అగర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తవ్వగా.. సహచర ఆటగాళ్లు, క్రికెట్ దిగ్గజాలు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్ సైతం సూర్యకు మద్దుతుగా ట్వీట్ చేశాడు. ప్రతీ క్రీడలో ప్రతీ ప్లేయర్ తమ కెరీర్ లో ఒడిదొడుకులను ఎదుర్కోవడం సర్వసాధారణం. ఒకానొక దశలో మేం కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులను అనుభవించామని యువరాజ్ సింగ్ తెలిపాడు. అవకాశం వస్తే ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తాడనే నమ్మకం తనకు ఉందని.. మన ప్లేయర్లకు మనం మద్దతుగా నిలుద్దాం.. సూర్య మళ్లీ తన ఆటతో ఉదయిస్తాడు అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సూర్యకుమార్ యాదవ్ కు అండగా నిలిచారు. సూర్యకుమార్ యాదవ్ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వైఫల్యాన్ని మరిచిపోయి ఐపీఎల్ లో చెలరేగాలని గవాస్కర్ సూచించారు.
Viral: ఓ తాతో నువ్వు ఈ వయసులోనే ఇలా ఉంటే.. మరి ఆ వయసులో..