Ranji Trophy 2026 Final: జమ్మూకాశ్మీర్ సంచలనం.. 67 ఏళ్ల తర్వాత మొదటిసారి రంజీ ట్రోఫీ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranji Trophy 2026 Final: హుబ్లీ వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టు కర్ణాటకపై చారిత్రాత్మక ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మెగా టోర్నీలో జమ్మూకాశ్మీర్ జట్టు 67 ఏళ్ల తర్వాత మొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుభమ్ పుండిర్ తన సెంచరీతో మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఆ తర్వాత ఔకిబ్ నబీ ఐదు వికెట్లు తీయడం J&K 291 పరుగుల ఆధిక్యాన్ని సాధించడంలో సహాయపడింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగిన ఈ నిర్ణయాత్మక పోరులో జమ్మూకాశ్మీర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి సత్తా చాటింది. మొదటి ఇన్నింగ్స్‌లో జే అండ్ కే ఏకంగా 584 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టులో శుభమ్ పుండిర్ 121 పరుగులతో అద్భుత సెంచరీ బాదగా, యావర్ హసన్ (88), సాహిల్ లోత్రా (72), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), కన్హయ్య వాధావన్ (70) అర్ధసెంచరీలతో కీలక పాత్ర పోషించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో రాణించినప్పటికీ, మిగితా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.
READ ALSO: Tomato Market price: తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పడిపోయిన టమాటా ధరలు
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక జట్టు జమ్మూకాశ్మీర్ బౌలర్ల ధాటికి తలవంచింది. కేవలం 293 పరుగులకే కర్ణాటక జట్టు కుప్పకూలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 160 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, ఇతర స్టార్ ఆటగాళ్లు కె.ఎల్. రాహుల్ (13), దేవదత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0) విఫలమయ్యారు. జమ్మూకాశ్మీర్ బౌలర్లలో ఆకిబ్ నబీ 5 వికెట్లతో కర్ణాటక బ్యాటింగ్ వెన్నువిరిచాడు. దీనితో జమ్మూకాశ్మీర్‌కు 291 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా జమ్మూకాశ్మీర్ నిలకడగా ఆడి 4 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బాల్ 160 పరుగులతో అజేయంగా నిలిచి కర్ణాటక బౌలర్లను విసిగించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో జట్టు భారీ స్కోరుకు పునాది వేసిన శుభమ్ పుండిర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. హుబ్లీ మైదానంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
READ ALSO: Israel-Iran War: యూఏఈ, కువైట్, బహ్రైయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ క్షిపణి దాడులు..
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!