Viral: పెళ్లంటే నూరేళ్ల పంట. దానిని జీవితాంతం గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తన పెళ్లికి పిలిచిన వారంతా రావాలని ఏ గొడవ లేకుండా అట్టహాసండా పెళ్లి జరిగిపోవాలనుకుంటారు. ఇక పెళ్లయిన తర్వాత బరాత్ మామూలుగా ఉండకూడదుగా మరి. పాటలు, డ్యాన్సులతో వీధంతా హోరెత్తాల్సిందే. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకల్లో పాల్గొనే వారిలో కొన్ని లేని టాలెంట్లు బయట పడుతాయి. అలాంటి ఆణిముత్యాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా అలాంటి ఓ వింత డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో నేపాలీ వ్యక్తి యోగా తరహా నృత్యం చేస్తూ కనిపించాడు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది.
Read Also: S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..
ప్రస్తుతం ఈ నేపాలీ తాత సుడిగాలి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెళ్లికి హాజరైన ఈ తాత.. మరికొందరు డ్యాన్స్‌లు చేయడం చూసి ఆపుకోలేక ఫుల్ ఉత్సాహంతో డ్యాన్స్ స్టెప్స్ వేయడం మొదలుపెట్టాడు. వీరి డ్యాన్స్ చూసిన వారెవరైనా ఫిదా అయిపోతారు. వీడియో చూసిన తర్వాత, సోషల్ మీడియాలో కొంతమంది బాబా రామ్‌దేవ్‌కు ఈ వ్యక్తి సవాల్ అని కూడా కామెంట్ చేస్తున్నారు.