విలాసవంతమైన జీవితాన్ని విడిచి.. సన్యాసిగా మారిన విదేశీ మహిళా డాక్టర్..
నేటి ప్రపంచంలో చాలా మంది డబ్బు, హోదా, విలాసాల కోసం పోటీ పడుతున్నారు. కానీ.. ఆత్మ శాంతి, జీవితానికి నిజమైన అర్థాన్ని వెతుక్కుంటూ భౌతిక సుఖాలను వదులుకునే వారు కొందరు ఉన్నారు. తాజాగా ఓ విదేశీ మహిళ విలాసవంతమైన జీవితం విడిచి సాధ్విగా మారింది. వృత్తిరీత్యా వైద్యురాలైన స్పానిష్ అమ్మాయి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. తమ దేశంలో అన్నీ వదిలి భారతదేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని స్వీకరించి సాధ్విగా జీవిస్తోంది. ఈ మహిళ ఇటీవల ఒక వీడియో ద్వారా తన జీవిత ప్రయాణాన్ని పంచుకుంది. తన కుటుంబం మొత్తం వైద్యురాలని, తాను జనరల్ డాక్టర్ అని చెప్పింది. ఆమె ఐదు సంవత్సరాలు MBBS చదివింది. తల, మెడ వ్యాధుల నిపుణురాలు. డాక్టర్ అయిన ఆ యువతి అద్భుతమైన జీవితాన్ని గడిపింది. ఆమెకు డబ్బు, హోదా, సౌకర్యం, స్నేహితులు అన్నీ ఉన్నాయి. కానీ.. ఏదో వెతుక్కుంటూ భారత్‌కి వచ్చింది.
చైనాను భయపెడుతున్న జనాభా సంక్షోభం.. పిల్లల తల్లిదండ్రులకు సబ్సిడీలు..
పాకిస్తాన్ మిత్రదేశం చైనా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా చైనాలో జనాభా తగ్గదల కనిస్తోంది. ముఖ్యంగా, పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి చైనా యువత ఆసక్తి చూపించడం లేదు. దీంతో జననాల రేటు పడిపోతోంది. ప్రస్తుతం, చాలా దేశాలు జనాభాను తమ వ్యూహాత్మక ఆస్తిగా పరిగణిస్తున్నాయి. చాలా దేశాల్లో యవ జనభా తగ్గిపోయి, వృద్ధ జనాభా పెరుగుతోంది. దీంతో ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తున్నాయి.
“సనాతన ధర్మం”పై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్..
శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘సనాతన ధర్మాన్ని’’ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ఆదివారం ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని కించపరచాలని, హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించాలని జితేంద్ర అవద్ నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖైదీ నెంబర్ 15528.. ప్రజ్వల్ రేవణ్ణ ‘‘జీవిత ఖైదు’’ ప్రారంభం..
మహిళపై అత్యాచారం చేసిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు ‘‘జీవిత ఖైదు’’ శిక్షను విధించింది. తన ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ చర్యని వీడియో తీసి, పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. రూ. 524 నెలవారీ వేతనం కోసం 8 గంటల పాటు రోజూవారీ పని చేయాలని ఆదేశించింది.
యాక్సిడెంట్‌లో జనసేన కార్యకర్త మృతి.. సెల్యూట్ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్..
యాక్సిడెంట్‌లో జనసేన కార్యకర్త మృతి చెందారు. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం, చందాల గ్రామానికి చెందిన జనసైనికుడు చందూ వీర వెంకట వసంతరాయలు గాయపడి బ్రెయిన్ డెడ్ కు గురయ్యారన్న వార్త తీవ్ర బాధాకరమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యాక్సిడెంట్ అనంతరం గుంటూరులోని రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కు గురై వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు.. అయినప్పటికీ వారి బాధను దిగమింగుకుని, మానవత్వాన్ని చాటుతూ ఆయన అవయవాలను ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు దానం చేసేందుకు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.
ఎంజీబీఎస్ నుండి చంద్రాయన్ గుట్ట మెట్రో రైల్ కారిడార్ పనులు వేగవంతం
ఎంజీబీఎస్ నుండి చంద్రాయన్‌గుట్ట మధ్య మెట్రో రైల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ విస్తరణ పనులు వేగవంతం అయ్యాయి. ఏడున్నర కిలోమీటర్ల మార్గంలో అలైన్మెంట్ అద్భుతంగా ఉండేలా చర్యలు చేపట్టామని, ఈ మార్గంలో రోడ్ విస్తరణ వల్ల ప్రభావితం అయ్యే ఆస్తుల సంఖ్యను తగ్గించేలా మార్గాన్ని రూపకల్పన చేశామని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో పనులకు సంబంధించి ఇంజినీరింగ్, రెవిన్యూ అధికారులతో రోజు వారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని అయన అన్నారు… ముందనుకున్న అంచనా ప్రకారం 1100 ఆస్తులు ఈ విస్తరణలో కూల్చవలసి ఉంటుందని భావించామని, కానీ ఎలైన్మెంట్ ను ఇంజనీరింగ్ నవకల్పన ద్వారా సరిదిద్దటం వల్ల ఆ సంఖ్య 900 వరకు తగ్గిందని ఆయన తెలిపారు. వీటిలో ఇప్పటికే 412 ఆస్తులకు సంబంధించిన అవార్డులు జరీ చేశామని, 380 ఆస్తుల కూల్చివేతలు ఇప్పటివరకు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు…
సంచలనం.. సోమవారం నుంచి షూటింగ్స్ బంద్..?
టాలీవుడ్ కు షాక్ తగిలింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ వేతనాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే సోమవారం నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని లెటర్ ఇచ్చిన నిర్మాతల సినిమాలకు మాత్రమే వెళ్లాలని నిర్ణయించింది. వేతనాలు పెంచి ఇవ్వని మిగతా వారి సినిమాలకు వెళ్లకూడదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కో ఆర్డినేషన్ కమిటీ కూడా వేసింది.పెంచిన వేతనాలు కూడా ఏ రోజువి ఆ రోజే ఇచ్చేయాలని చెప్పింది ఫెడరేషన్. ఈ రోజు వేతనాల విషయంలో ఫిలిం ఫెడరేషన్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ కు, ఫిల్మ్ ఫెడరేషన్ కు జరిగిన చర్చలు విఫలం కావడంతో ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా సినిమాల షూటింగులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ యూనియన్ స్ట్రైక్ వల్ల రేపు పూజా కార్యక్రమంతో స్టార్ట్ కానున్న అల్లరి నరేష్ కొత్త మూవీ వాయిదా పడింది. చాలా సినిమాల షూటింగులు, కొత్త మూవీల ప్రారంభోత్సవాలు ఆగిపోనున్నట్టు తెలుస్తోంది.
ఇదేంట్రా అయ్యా.. చాట్ జీపీటీతో అనిరుధ్ మ్యూజిక్?
‘నేనేప్పుడూ మీ బక్కోడినే’ అంటూ తెలుగు ఆడియన్స్ లవ్‌కు ఫిదా అయిన కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్, కింగ్డమ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. నిజమే… తక్కువ టైంలో అనిని తమ బ్రదర్‌గా ఓన్ చేసుకుంది టాలీవుడ్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, తన స్టెప్ ఇచ్చేస్తున్నాడు. ఇతను ఇస్తున్న సాంగ్స్, ట్యూన్స్, బీజీఎం — యూత్‌ను కట్టిపడేస్తున్నాయన్న విషయమై ఎలాంటి సందేహం లేదు. కానీ, సమ్‌టైమ్స్ట్యూ న్స్ తస్కరిస్తున్నాడన్న అపవాదూ అనిరుధ్ మూటగట్టుకుంటున్నాడు. ఒకసారి కాదు… అతడు వర్క్ చేస్తున్న ప్రతి సినిమాకు ఏదో ఒక క్యాపీ క్యాట్ వివాదం తలెత్తుతోంది.