భూ గ్రహంపైకి నీరు ఎలా వచ్చింది.? నాసా సమాధానం ఇదే.. ఈ విశ్వంలో దేవుడు సృష్టికి అద్భుత సాక్ష్యం మనం నివసిస్తున్న ‘‘భూగ్రహం’’. అత్యంత పక్కాగా ఒక నక్షత్రం నుంచి ఎంత దూరంలో ఉంటే జీవజాలం మనుగడ సాధ్యం అవుతుందో అలాంటి ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో భూమి ఉంది. అయితే, మొదట జీవం సముద్రాల్లో పుట్టిందని అనేక థియరీలు చెబుతాయి. ఇలాంటి సముద్రాల్లోకి నీరు ఎలా వచ్చిందనేది ఇప్పటికీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. దీనికి నాసా…
తెలుగులో మాట్లాడి షాకిచ్చిన జపాన్ ఫ్యాన్.. అల్లు అర్జున్ క్రేజీ రియాక్షన్! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలకు జపాన్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల అక్కడ ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా ఈ జోడి జపాన్‌లో సందడి చేసింది. ఈ పర్యటనలో ‘కజు’ అనే ఒక జపనీస్ అభిమాని అల్లు అర్జున్, రష్మికలను ఇంటర్వ్యూ చేస్తూ, అనూహ్యంగా తెలుగులో మాట్లాడి వారిని ఆశ్చర్యపరిచాడు. అర్జున్ అతనితో జపనీస్‌లో మాట్లాడటానికి…
సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు! నగరిలో టీడీపీ ఎమ్మెల్యే చేసింది శూన్యం అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. కల్యాణమండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా వైసీపీనే ఇచ్చిందన్నారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సీఎం చంద్రబాబు టెక్స్టైల్ పార్క్ పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం అబద్ధాలు వినలేక నగరిప్రజలు పారిపోయారన్నారు. నగరి నియోజకవర్గానికి ఉపయోగపడేది ఒక్కటీ…
ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరో గుర్తింపు ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఘనమైన గుర్తింపు లభించిందని రాష్ట్ర మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్‌లో నిర్వహించనున్న భారత్ రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ హస్తకళలతో రూపొందించిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లను అందజేయాలని భారత్ హై కమిషన్ నిర్ణయించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సింగపూర్‌లోని భారత్ హై కమిషనర్, మొత్తం 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌ల తయారీకి ఏపీ ప్రభుత్వ సంస్థ లేపాక్షికి ఆర్డర్ ఇచ్చారు.…
సింగరేణి, నైని బొగ్గు బ్లాక్ విషయంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ కు ఆత్మ సింగరేణి అని అన్నారు. అలాంటి సింగరేణిపై కట్టుకథలు.. కొన్ని లేఖలు.. కొన్ని రివ్యూ లు వచ్చాయని మండిపడ్డారు. 42 వేల మంది సింగరేణి ఉద్యోగుల.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 20 వేల మంది నీ మోరల్ గా దెబ్బతీసేలా చేశారని ఫైర్ అయ్యారు. ప్రధానంగా పెట్టుబడులు రాకుండా..…
టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్ కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. టీ హబ్ ను ప్రత్యేక స్టార్టప్ ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన…
పాక్‌పై దాడిలో అసలు విజయం “వైమానిక దళానిదే”: ఐఏఎఫ్ చీఫ్ దేశ భద్రతకు కేవలం ఆర్థిక బలమే సరిపోదని, బలమైన సైనిక శక్తి తప్పనిసరి అని భారత వైమానిక దళ చీఫ్(IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన 22వ సుబ్రతో ముఖర్జీ సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులను గురించి ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో ‘‘ఎయిర్ పవర్’’ చాలా…
భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు.. అందుకే దుబాయ్‌కు వెళ్ళిపోయానన్న రిమీ సేన్! బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధూమ్’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన నటి రిమీ సేన్. ‘హంగామా’, ‘గోల్ మాల్’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బెంగాలీ భామ, తెలుగులో చిరంజీవి సరసన ‘అందరివాడు’ మూవీలో కూడా నటించింది. కానీ గత కొంతకాలంగా వెండితెరకు పూర్తిగా దూరమైంది. 2011లో వచ్చిన ‘షాగీర్ద్’ ఆమె చివరి సినిమా. అయితే, ఆమె…
Telangana: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందానికి విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు.
పాత పన్ను విధానం తొలగింపు..? వేతన జీవులకు గుడ్‌న్యూస్..! బడ్జెట్ 2026-27 ఎలా ఉండబోతోంది? అనేదానిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. కేంద్ర ఆర్తిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు.. అయితే, బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జీతం పొందే వర్గం దృష్టి మొత్తం ఆదాయపు పన్ను విధానంలో వచ్చే మార్పులపైనే ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఇందులో పాత పన్ను విధానాన్ని పూర్తిగా…