హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..? హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించనున్నారు. సోమవారం ఉదయం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్న సీఎం 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకోనున్నారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ దాజీ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్ నెస్ , మెడిటేషన్ సెంటర్ సహా, యోగా కేంద్రాలను ముఖ్యమంత్రి…
ఆరోజే సంక్రాంతికి దిగుతున్న శంకర్ వరప్రసాద్ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన కాంబినేషన్‌గా మారబోతున్న మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడిల సినిమా విడుదల తేదీపై సస్పెన్స్‌కు తెరపడింది. ఈ భారీ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ప్రెస్ మీట్లో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి అభిమానులకు మరియు సినీ ప్రేమికులకు…
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన అందిస్తున్నారని ప్రధాని అభినందించారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరు శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ…
ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్.. మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్‌కు మంధాన ఫుల్ స్టాప్ పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి రద్దు అయిన విషయాన్ని ప్రకటించింది. పెళ్లి రద్దు గురించి ప్రకటించిన కొంతసేపటికే.. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. నవంబర్ 23న ఈ జంటకు వివాహం జరగాల్సి ఉంది. అయితే, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానాకి…
అల్లర్లు లేవు.. అంతా బాగానే ఉంది.. బాబ్రీ మసీదుపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు ఢిల్లీలో ఈరోజు ( డిసెంబర్ 6న) జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తన పదవీకాలంలో రాష్ట్రంలో “అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, అంతా బాగానే ఉంది” అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం యూపీలో నెలకొన్న శాంతి- భద్రతలు గతంలో ఉన్న అస్థిరతతో పోల్చితే పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. బలమైన పోలీసింగ్ వ్యవస్థ, బాధ్యతాయుత ప్రభుత్వంతో…
ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు తప్పిపోయిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించాలని కోరుతూ దాఖలపై పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులకు దేశం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించాలా.? అని ప్రశ్నించారు. ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వారిని దేశంలో ఉంచాల్సిన బాధ్యత ఉందా అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. రోహింగ్యాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా బహిష్కరించాలని పిటిషన్ లో కోరారు. దీనిని సీజేఐ మాట్లాడుతూ.. ‘‘ ముందుగా చట్టవిరుద్ధంగా సరిహద్దు…
ఆదర్శంగా సీఎం కుమారుడు.. సామూహిక వివాహా వేడుకలో పెళ్లి.. ప్రస్తుత కాలంలో సాధారణ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు. కానీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుమారుడు మాత్రం ఈ విషయంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మోహన్ యాదవ్ చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్ అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అభిమన్యు యాదవ్, ఇషితా యాదవ్ సామూహిక వివాహ వేడుకల్లో ఒకటయ్యారు. పరువు…
ఏపీకి అలర్ట్.. రేపు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. దిత్వా తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ…
ఎస్సీ రిజర్వేషన్ జాక్‌పాట్.. ఏకైక అభ్యర్థిగా మల్లమ్మ ఎంపిక వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ పంచాయతీలో రిజర్వ్ సీటు కారణంగా కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. ఆ ఊరిలో 1,600 కి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ఎస్సీ మహిళా రిజర్వ్ సీటు కారణంగా ఒక్కరే మహిళ ఉండటంతో.. మల్లమ్మకు ఈ పదవి లభించింది. గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ కింద ఎస్సీ మహిళా స్థానంలో ఒక్కరు మాత్రమే ఉండటంతో సర్పంచ్ పదవి మల్లమ్మకు వెళ్లింది అని…
మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్ సిగ్నల్..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ…