Harish Rao: కేసీఆర్ నంబర్ వన్ కాబట్టే.. తెలంగాణ నంబర్ వన్ అయ్యిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిమ్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించదగ రోజని వ్యాఖ్యానించారు. 60 ఏళ్లలో కొత్త ఆస్పత్రులు గత ప్రభుత్వాలు నిర్మించ లేదని తెలిపారు. 10 వేల పడకలతో రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చిన రాష్ట్ర ప్రజలకు మాంచి ఆరోగ్య వ్యవస్థను అందుబాటులో పెడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ఐటీ, వ్యాక్సిన్, ఫార్మా హబ్.. రాబోయే రోజుల్లో హెల్త్ హబ్ గా రాష్ట్రం మారనుందని మంత్రి తెలిపారు. 134 పరీక్షలు టి.డయాజ్ఞోస్టిక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నామని అన్నారు. 102 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రం వచ్చినప్పుడు 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు 8340 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లేకుండా వచ్చే సంవత్సరం మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు గర్భిణీ స్త్రీలకు రెండు సార్లు ఇస్తామన్నారు. కడుపులో బిడ్డ పడితే న్యూట్రిషన్ కిట్లు, కడుపులో నుంచి బిడ్డ బయట రాగానే కేసీఆర్ కిట్ ఇస్తున్నామని గుర్తు చేశారు.
Read also: Putin: అవసరమైతే ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి వెనుకాడబోము
కేసీఆర్ ప్రజలకు ఇచ్చేవి కిట్లు, ప్రతిపక్షాలవి తిట్లు అంటూ ఎద్దేవ చేశారు. న్యూట్రిషన్ పాలిటిక్స్ మావి… పార్టీషన్ పాలిటిక్స్ ప్రతిపక్షాలవి అంటూ వ్యంగాస్త్రం వేశారు. ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ పాలన ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ పాలనలో కరెంట్ వెలుగులు… కంటి వెలుగులు అని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు… కందిళ్ళ మోతలు ఉండేవని విమర్శించారు. సీజనల్ వ్యాధులను పూర్తి స్థాయిలో అరికట్టామని అన్నారు. కేసీఆర్ నంబర్ వన్ కనుక… తెలంగాణ నంబర్ వన్ అయ్యిందని మంత్రి హరిశ్ రావ్ పేర్కొన్నారు. శాఖ ఏదైనా తెలంగాణ ముందుందని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Telangana: తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు.. సచివాలయం, యాదాద్రికి దక్కిన గుర్తింపు