Telangana: తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అందించే గ్రీన్ యాపిల్ అవార్డులను రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలు అందుకున్నాయి. సచివాలయం, యాదాద్రి దేవాలయం, మొజంజాహీ మార్కెట్, దుర్గం చెరువు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు ఈ అరుదైన గౌరవం దక్కింది. బ్యూటిఫుల్ వర్క్‌స్పేస్ బిల్డింగ్ విభాగంలో తెలంగాణ సెక్రటేరియట్, హెరిటేజ్ విభాగంలో మొజంజాహీ మార్కెట్, యూనిక్ డిజైన్ విభాగంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, స్పెషల్ ఆఫీస్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అత్యుత్తమ మత నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు లభించాయి. ఈనెల 16న లండన్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఈ అవార్డులను అందుకోనున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు రావడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
అవార్డులు గెలుచుకున్న నిర్మాణాలు
1) మోజం జాహి మార్కెట్
2) దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
3) బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ బిల్డింగ్
4) ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
5) యాదాద్రి టెంపుల్
Read also: Kabali Producer KP Chowdary: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ‘కబాలి’ నిర్మాత అరెస్ట్
గతంలో తెలంగాణకు మరో 5 జాతీయ అవార్డులు వచ్చాయి. 8 దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ అవార్డులతో పాటు మరో 5 నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ అవార్డులు ఇటీవల లభించాయి. కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహ్రా ప్రకటించగా.. వాటిని రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు అందుకున్నారు. దీంతో కేంద్రం ప్రకటించిన అన్ని అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులను గెలుచుకుంది. తెలంగాణకు ఇచ్చిన నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తం పంచాయత్ సతత్ వికాస్ అవార్డులు ఇవే.. ఉత్తమ బ్లాక్ (మండలం) పంచాయతీల అవార్డు కేటగిరీలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్‌ఎండీ. ఉత్తమ్ జిల్లా పరిషత్ డివిజన్ లో ములుగు జిల్లా. ప్రత్యేక కేటగిరీ అవార్డులలో… ఆదిలాబాద్ జిల్లా ముఖార కె గ్రామం గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో.. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్ డివిజన్‌లోని కన్హా గ్రామం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా.. సిద్దిపేట జిల్లాకు చెందిన మర్కూక్ ఎర్రవెల్లి నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ – సర్టిఫికెట్ల కేటగిరీ – గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీ అవార్డుకు ఎంపికయ్యారు.
IND vs WI: బలహీన టీంపై ప్రతాపం చూపిస్తే ఏం లాభం?.. టీమిండియాను ఎద్దేవా చేసిన భారత లెజెండ్!