Nokia XR21 5G Launch 2023: గతంలో ‘నోకియా’ కంపెనీ మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో రకాల ఫోన్స్ రిలీజ్ చేసి కస్టమర్లను ఆకట్టుకుంది. అయితే షియోమీ, వివో, రియల్ మీ, సామ్ సంగ్, ఐఫోన్ లాంటి సంస్థలు రావడంతో నోకియా హవా పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ మార్కెట్‌లో తిరిగి నంబర్ వన్ అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. నోకియా కంపెనీ మేలో యూకేలో నోకియా ఎక్స్ఆర్21 (Nokia XR21) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఒక నెల తర్వాత అమెరికన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇప్పుడు యూరప్ మార్కెట్‌తో పాటు ఆస్ట్రేలియాకు కూడా ఈ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. నోకియా ఎక్స్ఆర్21లో అనేక మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Nokia XR21 5G Price:
ఆస్ట్రేలియాలో నోకియా ఎక్స్ఆర్21 ధర 799 AUD కాగా.. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు నెదర్లాండ్స్‌లో 599 యూరోస్. ఈ ఫోన్ ఒకే రంగులో (మిడ్నైట్ బ్లాక్) వస్తుంది. 6GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. నోకియా వైర్‌లెస్ స్పీకర్ 2 మరియు 33W ఛార్జర్ ఆస్ట్రేలియాలో ఉచితంగా లభిస్తాయి. నోకియా ఎక్స్ఆర్21 యొక్క ప్రతి కొనుగోలుతో యూరోపియన్ కస్టమర్‌లు ఉచితంగా నోకియా క్లారిటీ ఇయర్‌బడ్‌లను పొందుతారు.
Nokia XR21 5G Specs:
నోకియా ఎక్స్ఆర్21 ఫోన్ 6.49-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ మరియు ఫుల్ ఎచ్డీ + రిజల్యూషన్‌ను కలిగి ఉన్న పంచ్-హోల్ కటౌట్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 550 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ కారణంగా సౌకర్యవంతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. దీని డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ ఇస్తుంది. తడి చేతులు లేదా గ్లోవ్స్‌తో కూడా టచ్‌పై పని చేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు రెండు బటన్‌లు ఉన్నాయి. ఈ ఫీచర్లు అద్భుతమైన మరియు యూజర్ ఫ్రెండ్లీ ఫోన్‌గా మార్చాయి.
Nokia XR21 5G Design:
నోకియా ఎక్స్ఆర్21 ఫోన్ 100 శాతం రీసైకిల్ అల్యూమినియం చట్రంతో ధృడమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ మన్నిక ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. IP68 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది. ఇది కాకుండా దుమ్ము, నీరు మరియు డాట్స్ లాంటి వాటిని పడకుండా చేస్తుంది.
Nokia XR21 5G Camera:
నోకియా ఎక్స్ఆర్21 హై-క్వాలిటీ సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు 64MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Nokia XR21 5G Battery:
ఈ ఫోన్ 6GB RAM మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,800mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది.