Putin: రష్యా సరిహద్దులను రక్షించేందుకు అవసరమైతే మరింత ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని తాను దళాలను ఆదేశించవచ్చని రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వార్ ప్రతినిధులతో సుమారు 2 గంటలపాటు మీడియా సమావేశం నిర్వహించారు. శీతాకాలం తర్వాత ఉక్రెయిన్ బలగాల ప్రతిదాడులు విఫలమయ్యాయని, ఆ దేశ సైన్యం తీవ్రంగా నష్టపోతోందని పేర్కొన్నారు. కీవ్ సైనిక నష్టాలు భారీగా ఉన్నాయని తెలిపారు. తాను కొత్త బలగాల సమీకరణ గురించి ఆలోచించడం లేదని పుతిన్ చెప్పారు. డ్నీపర్ నదిపై వంతెన ధ్వంసం, భారీ వరదలకు ఉక్రెయిన్ దళాలే కారణమని పుతిన్ పునరుద్ఘాటించారు.
Read also: Somu Veerraju: బీజేపీ అండగా ఉండకపోవచ్చన్న జగన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఫైర్
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడిలో 11 మంది మరణించిన తర్వాత పుతిన్ ఈ మీడియా సమావేశం జరిగింది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ 160 ట్యాంకులను, 360 సాయుధ రక్షణ వాహనాలను కోల్పోయిందని పుతిన్ వివరించారు. రష్యా కేవలం 54 ట్యాంకులను కోల్పోయిందన్నారు. అయితే ఉక్రెయిన్ అధికారులుగానీ, సైన్యం గానీ, ప్రభుత్వం గానీ యుద్ధ నష్టాలపై స్పందించలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా కూడా వెంటనే స్పందించలేదు. కానీ పుతిన్ వ్యాఖ్యలు పూర్తిగా నిజం కాదని కొందరు అమెరికా అధికారులు తెలిపారు. రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ బలగాల షెల్లింగ్, దాడులను రష్యా తట్టుకోలేకపోతోందని ఆయన అన్నారు. అందుకే ఉక్రెయిన్ భూభాగంలో రష్యా సరిహద్దుల కోసం శానిటరీ జోన్‌ను ఏర్పాటు చేస్తానని పుతిన్ ప్రకటించినట్టు చెప్పారు.
Read also: Mirnalini Ravi Hot Pics: బ్లాక్ శారీలో మిర్నాలిని రవి.. బ్యాక్ అందాలతో కేక పుట్టిస్తుందిగా!
ఉక్రెయిన్‌లోని అతి ముఖ్యమైన ఓడరేవు నగరమైన ఒడెస్సాపై రష్యా అర్ధరాత్రి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక గిడ్డంగి, వాణిజ్య కేంద్రం మరియు దుకాణాలను క్షిపణులు లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండొచ్చని ఉక్రెయిన్ సదరన్ కమాండ్ హెచ్చరించింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కీ స్పందించారు. పౌరులపై దాడిని దృష్టిలో ఉంచుకుని, మిత్రరాజ్యాలు మరిన్ని రక్షణ పరికరాలను అందించాలని కోరారు. అయితే అమెరికా మంగళవారం మరో 235 మిలియన్ డాలర్ల భద్రతా సహాయాన్ని ఉక్రెయిన్‌కు ప్రకటించింది.