కేసీఆర్, కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులు, మిత్తిలు కట్టడం ఇబ్బందిగా ఉందన్నారు. రైతు కళ్లలో ఆనందం చూసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వ్యాఖ్యలు నమ్మే విధంగా లేవని మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టావు.. ఎవరి కోసం కట్టారని ప్రశ్నించారు. ఎనిమిదో వింత కాళేశ్వరం ఎవ్వరూ కూలకొట్టకుండానే కూలి పోయింది.. దానికి మీరు బాధ్యులు కాదా అని దుయ్యబట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ తనను ఉద్దేశించి వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం వేసిందని వ్యాఖ్యానించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో మీకు పని ఏమిటి..? రేస్ కార్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది.. ఏసీబీ కార్ల రేస్ పై చట్ట ప్రకారం ప్రశ్చించేందుకు ప్రయత్నాలు చేసింది.. 13 రోజుల క్రితం కార్ల రేస్ వ్యవహారంలో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్‌కి ఏసీబీ విజ్ఞప్తి చేసిందన్నారు. గవర్నర్ నుంచి త్వరలో అనుమతి వస్తుందని తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి కేసులు విత్ డ్రా చేసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారా.. మీ తప్పులు మాఫీ చేయించుకునేందుకు బీజేపీ నేతలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని మంత్రి పొంగులేటి తెలిపారు.
Tollywood : యంగ్ హీరోలతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ వీరే
కవిత కేసు మాదిరిగానే కార్ల రేస్ కేసులో బయట పడేందుకు ఢిల్లీ వెళ్లినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి అన్నారు. గతంలో చెప్పినట్లుగా దీపావళి, తాటాకుల బాంబు ఏదైనా కావచ్చు.. మీరు చెప్పినట్లుగా అది తుస్సు బాంబు కావచ్చన్నారు. విదేశాలకు పంపిన రూ. 55 కోట్లు చట్టంలోని ఏ యాక్ట్ ప్రకారం పంపారు.. ఒప్పందం కాక ముందే మీరు విదేశాలకు డబ్బుల మీ సంస్థలకు పంపింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎలా విదేశాలకు ఎలా పంపారని అన్నారు. దేశానికి సంబంధించిన డబ్బు విదేశాలకు పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
AP Assembly Sessions 2024: ముగిసిన బీఏసీ.. ఎవరికోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు..!
ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరినీ ఉద్దేశ్య పూర్వకంగా జైల్లో పెట్టడం జరుగదని మంత్రి పొంగులేటి అన్నారు. ఒక్క ఈ రేస్ కార్ల కేసుకే కంగారు పడుతున్నారు.. రాబోయే రోజుల్లో అనేక కేసులు రానున్నాయని మంత్రి తెలిపారు. ఐపీఆర్, విద్యుత్ శాఖలకి చెందిన అనేక కేసులు ఇంకా రావచ్చు.. అన్ని కేసులు వస్తే మీరు అంతరిక్షంలో దాక్కుంటారేమో అన్న అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పేదోడికి చెందిన ఆస్తులను కొల్లగొట్టిన ఎవ్వరినీ వదిలిపెట్టం.. ఎంత పెద్ద దొర ఆయిన వదిలిపెట్టేది లేదన్నారు. విదేశాలలో ఉన్న తొత్తూ.. సంస్థకు ఇచ్చిన డబ్బులు అన్ని రాబడతామని తెలిపారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ చిన్న విషయం కాదు.. ఖమ్మం జిల్లాలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నారు. అన్ని అంశాలు రాబోతున్నాయని మంత్రి చెప్పారు.