ఈజీమనీకి అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడే వారు కొందరైతే.. మరికొందరేమో పొలిటికల్ లీడర్స్ ను అడ్డం పెట్టుకుని సంపాదించాలని చూస్తుంటారు. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకాల్సిందే కదా.. ఇదే రీతిలో ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డీ పర్సనల్ అసిస్టెంట్స్ మంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. చివరికి వీరి బాగోతం బట్టబయలు కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్…
Ponguleti Srinivas Reddy : గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్‌ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు 400 ఎకరాల భూమి విషయాన్ని పట్టించుకోని బీఆర్‌ఎస్ ఇప్పుడు అప్రసక్తమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. అంతేకాదు, ఈ భూములను తమ అనుబంధ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేసిన చీకటి ఒప్పందాల వెనుక ఆ పార్టీనే ఉందని ఆరోపించారు. గచ్చిబౌలి భూముల వివాదం పెరుగుతున్న నేపథ్యంలో…
వరంగల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న గత ప్రభుత్వ పెద్దలు వేటకుక్కలుగా మారి అందినకాడికి దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాపలా కుక్కలు వేట కుక్కలుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయని.. ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తామని తెలిపారు.
Ponguleti Srinivas Reddy: కార్పొరేట్ పాఠశాలకంటే ధీటుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేట్ పాఠశాలలను నిర్మిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కేసీఆర్, కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులు, మిత్తిలు కట్టడం ఇబ్బందిగా ఉందన్నారు. రైతు కళ్లలో ఆనందం చూసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వ్యాఖ్యలు నమ్మే విధంగా లేవని మంత్రి పొంగులేటి తెలిపారు.
రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి పంట నష్టపోయారని చెప్పారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని.. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 117 గ్రామాలలో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యాయని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సెలవులు పెట్టొద్దన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు రేపు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఖమ్మంలో నాకు కావాల్సిన ఓ ముస్లిం కుటుంబం వరదల్లో చిక్కుకుందని, వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి.…