ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల సామర్థ్యం అమెరికా దగ్గర ఉందని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా అణ్వాయుధ నిరాయుధీకరణపై మాట్లాడుతూనే ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి అమెరికా సొంతం అని పునరావృతం చేశారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన రోడ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
బీహార్‌లో రసవత్తరంగా ఎన్నికల సమరం సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ పెంచారు.
మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు.
బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లభించకపోవడం దేవుడు తనకు ఇచ్చిన అతి పెద్ద వరం అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన హల్బా సమాజ్ మహాసంఘ్ స్వర్ణోత్సవ వేడుకల్లో నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.
అమెరికాపై భారతదేశమే భారీగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది చాలా సంవత్సరాలుగా ఈ సంబంధం ఏకపక్షంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పుతిన్ మాట్లాడారు.
దేశంలో ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్లో ఉన్న నాయకులు 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై మోహన్ భాగవత్ క్లారిటీ ఇచ్చేశారు.
విద్య, ఆరోగ్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండోర్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం.. ఈ రెండూ కూడా సామాన్యుడికి దూరమైపోయాయని తెలిపారు.
కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా.. ఇద్దరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. పార్టీ తరపున పార్లమెంట్లో గళం వినిపించాల్సిన నేతలు.. వ్యక్తిగత విమర్శలతో రచ్చకెక్కారు. పార్టీని బజారునపడేశారు.