Jagadish Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హక్కులను, గోదావరి నీళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో రేవంత్ డిల్లీలో రహస్య సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. బనకచర్ల అంశాన్ని సీఎం రేవంత్ reddy ఎజెండాలో లేనట్టుగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు జగదీష్ రెడ్డి. ఇదే విషయంపై ఏపీ మంత్రి రామానాయుడు నిపుణుల కమిటీ వేశామని స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఏమీ తెలియనట్లుగా నటించడాన్ని ఆయన ప్రశ్నించారు.
Crop Cultivation: తొలకరి పంటకే ఇన్ని కష్టాలైతే.. మరి రబీ పరిస్థితి ఏంటి?
రాజకీయ నాయకులు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం కాకుండా ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలంటూ జగదీష్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు బూతులు మాట్లాడడం ఆపాలని, బదులుగా నైతికంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చూసి అది పూర్తిగా చంద్రబాబు స్క్రిప్ట్ నుంచే వచినదని అనిపిస్తోందని విమర్శించారు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిలో ఉండే నైతిక హక్కు లేదన్నారు.
ప్రజలు గెలిపించిన నాయకుడు, ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిందిగా చెప్పారు. కానీ రేవంత్ తన కుటుంబ స్వార్ధం కోసం ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పట్ల అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ బేసిన్లే లేవని చెప్పిన విధానం సరిగ్గా ఉందని, అదే దిశగా ముందుకెళ్లాలన్నారు.
JUNIOR : జూనియర్ పక్కన నటించేందుకు శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.?