బీఆర్ఎస్ నాయకత్వంపై , గత ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే, ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ప్రతి రూపాయిని పొదుపు చేస్తూ పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. “గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది తప్ప,…
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన వారు నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగులు పడిన అష్టకష్టాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. “అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ సాక్షిగా పదేళ్లు నిరుద్యోగులను వంచించిన చరిత్ర మీది కాదా? నాడు నోటిఫికేషన్ల పేరుతో…
Aadi Srinivas : తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను, అవినీతిని ముఖ్యమంత్రి ఎండగట్టడంతో కేటీఆర్, హరీష్ రావులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్…
Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టుల క్రెడిట్ , నీటి కేటాయింపులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హరీష్ రావు తీరును , బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తుంటే, అన్నీ తనకే…
హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య రీతిలో దిగి వస్తూ శాసనసభ నిబంధనలు లేకుండా సభను నడుపుతున్నారని ఆరోపించారు. బీఏసీలో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు వేరు అసెంబ్లీలో పెట్టినవి వేరు.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు పెట్టకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
KTR Slams CM: మీడియాతో చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా నది ఎక్కడ ఉన్నది అడిగాడు.. భాక్రానంగాల్ ఏ రాష్ట్రంలో ఉందో తెలియదని సెటైర్లు వేశారు.
Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Suryapet: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. గాయపడ్డవారిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు…
Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ భద్రత మధ్య కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో, 42 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ పనుల్లో 186 మంది సిబ్బంది…
Jubilee Hills By-Election Result 2025: రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తేలనున్నాయి..