Jagadish Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హక్కులను, గోదావరి నీళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో రేవంత్ డిల్లీలో రహస్య సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. బనకచర్ల అంశాన్ని సీఎం రేవంత్ reddy ఎజెండాలో లేనట్టుగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు జగదీష్ రెడ్డి. ఇదే విషయంపై ఏపీ మంత్రి రామానాయుడు నిపుణుల కమిటీ వేశామని…
గోదావరి జలాలు, పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలవరం ప్రాజెక్టు మరియు గోదావరి జలాల సమస్యకు సంబంధించి స్పష్టంగా అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఉందన్న ఆయన.. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇందిరా సాగర్ ప్రాజెక్టు పురోగతిని అడ్డుకుంది.. గోదావరి నదికి చెందిన అనేక ప్రధాన ఉపనదులు ఛత్తీస్‌గఢ్ లోని ప్రాణహిత, ఇంద్రావతి మరియు శబరి వంటివి కేంద్ర సహకారంతో పొరుగు రాష్ట్రాలు చేపట్టిన…
గోదావరి జలాలను ఒక్క బొట్టు కూడా వదులుకోమని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రభుత్వంతో చర్చిస్తాం.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడమన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ని అసలు ఒప్పుకునేదే లేదని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కట్టి.. నీళ్లు ఎక్కడికి తీసుకుపోయారో చూసాము.. పక్కనే ఉన్న గోదావరి నీళ్లను ఇక్కడి ప్రజలకి అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
CM Revanth Reddy : తెలంగాణలో రేషన్ కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాకుండా, అది పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం పట్ల తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు అని, ఆకలి తీరేందుకు ఉపయోగపడే…
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
ఓట్లు అన్నీ నీకు వేస్తే.. నీళ్ళు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా.. తెలంగాణలో ఆయనకట్టు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నల్గొండకు కోతలు... రంగారెడ్డి కి నీళ్ళు ఇవ్వలేదన్నారు.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకుపోతే తప్పులేదు అన్నారని చెప్పారు. పొద్దున్న క్లబ్.. రాత్రి ఐతే పబ్బుల్లో చర్చ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..
బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వందేళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు అని తెలిపారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, ఇకపై కూడా చెప్పను అని చెప్పారు. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2ను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం.. పంప్ హౌస్ 2 నుంచి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు.
కృష్ణా గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "ఉత్తమ్ కుమార్ చెత్త ఆరోపణలతో లాభం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారు. నాగార్జునసాగర్ , శ్రీశైలం లో నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదు. ఇంత నీటి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు తెలంగాణలో తాగునీరుకి కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతన కల్లు గ్రామంలో గంగాదేవి పాడు ప్రాథమిక సహకార సంఘం నూతన భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. రైతులను ఆదుకునే ప్రభుత్వమని, రైతు సంక్షేమం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు మంత్రి తుమ్మల. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం…