Jagadish Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడెక్కుతున్న వేళ, ప్రచార రంగంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు, పోలీసులు, గుండాయిజాన్నే నమ్ముకున్నారని, కానీ ప్రజలు ఈ రౌడీయిజాలను, బెదిరింపులను ఎప్పుడూ లెక్కపెట్టరు అని వ్యాఖ్యానించారు. తండ్రి లాగానే కుమారుడూ భయపెడతానంటూ మాట్లాడుతున్నారని, కానీ…
Jagadish Reddy vs Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమావేశం అయ్యారు. సోమవారం ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌పై చర్చిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు కూడా సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ఫామ్‌హౌస్‌లో…
Jagadish Reddy : బీఆర్‌ఎస్‌లో నెలకొన్న విభేదాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన, ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. “నా ఉద్యమ ప్రస్థానంపై ఉన్న జ్ఞానానికి కవితకు జోహార్లు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయన, “కేసీఆర్‌కు బద్ధ శత్రువులైన రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఏమి మాట్లాడుతున్నారో అదే పదాలను కవిత వాడుతున్నారు” అని విమర్శించారు. “వాళ్లు ఉపయోగించిన పదాలను కవిత వల్లెవేస్తున్నారు” అంటూ…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి బీఆర్‌ఎస్‌లోని ఒక కీలక నేతనే కారణమని ఆమె ఆరోపించారు. జగదీష్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండానే BRS లిల్లీపుట్ అంటూ కవిత ఫైర్ అయ్యారు. నల్గొండలో బీఆర్‌ఎస్‌ను నాశనం చేసిన లిల్లీపుట్ అన్న కవిత.. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక్కడే గెలిచాడు అని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖను బహిర్గతం చేయడం…
Jagadish Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హక్కులను, గోదావరి నీళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో రేవంత్ డిల్లీలో రహస్య సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. బనకచర్ల అంశాన్ని సీఎం రేవంత్ reddy ఎజెండాలో లేనట్టుగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు జగదీష్ రెడ్డి. ఇదే విషయంపై ఏపీ మంత్రి రామానాయుడు నిపుణుల కమిటీ వేశామని…
ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం లేదు.. జేడీ వాన్స్ కీలక ప్రకటన ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల తర్వాత.. ఇరాన్‌కు అణు సామర్థ్యం లేదని ప్రకటించారు. ఇకపై ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించలేదని పేర్కొన్నారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు…
Jagadish Reddy : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోదావరి – కృష్ణ జలాల వినియోగానికి సంబంధించిన అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నీటి వాటా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు నష్టం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కీలక అంశంపై…
కృష్ణా జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కేఆర్ఎంబీ చెప్తుంది.. ఈడీ చార్జ్ షీట్ లో తన పేరు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని వద్దకు వెళ్లారు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు.