Konaseema Farmers Water Crisis: వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలతో కోనసీమ రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. శివారు భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. తొలకరి పంటకే సాగునీటి కష్టాలు అయితే.. రబీలో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Buddha Venkanna: చంద్రబాబు 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతున్నారు.. బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో సాగునీటి కష్టాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటులు వేసిన వరి పంటకు నీరు అందకపోవటంతో చేలు ఎండిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో రైతులు నీటి కష్టాలను అనుభవిస్తున్నారు. కాలువ ముందు ఉన్న వారు నీటిని ఎక్కువగా వినియోగించుకోవడంతో శివారు ప్రాంతాల రైతులకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. గోదావరిలో నీరు పుష్కలంగా ఉన్నా.. పంట కాలులకు పూర్తిగా నీరు వదలపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలకరి పంటకే నీటి కష్టాలు ఇలా ఉంటే.. రెండో పంటకు పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తమ సాగు నీటి కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.