Eatala Rajendar: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. హైడ్రాతో ముఖ్యమంత్రి దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 1965లో అల్వాల్ లో 50 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఓ కాలనీ ఉంది.. ఈ కాలనీకి ఇంటింటికీ నోటీసులు ఇవ్వడమే కాకుండా.. చివరికి గుడులకు కూడా నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఒక తరం త్యాగం చేస్తే.. రెండో తరం ఇల్లు కట్టుకుంది.. మూడో తరం చదువుకుంటోంది అని గుర్తు చేశారు. బాలాజీ నగర్, అరుందతి నగర్ లో ఇలా ఉంది పరిస్థితి.. ఇక, ప్రజల జీవనంలో మంచి మార్పు వస్తదని ముఖ్యమంత్రిని చేస్తే.. నేను ఎవరు చెప్పినా వినను.. నాకు నేను నిర్ణయం తీసుకుంటానంటున్నాడు.. హైడ్రా పేరుతో పక్కా ఇల్లు కూలగొట్టుడే.. అడ్డమొచ్చిన వాళ్లను బుల్డోజర్లతో తొక్కవలసిందే అన్నట్లుగా రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ఇస్తున్నాడని ఎంపీ ఈటల అన్నారు.
Read Also: Pithapuram Crime: పిఠాపురంలో చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అంతా అమ్మమ్మే చేసింది!
అయితే, ఇంటెలిజన్స్ వ్యవస్థ అయినా ఇక్కడి ప్రజల పరిస్థితి చెప్తుంటరు కదా.. అయినా సీఎం రేవంత్ ఎందుకు వినడం లేదని బీజేపీ ఎంపీ ఈటల ప్రశ్నించారు. ఎవరు చెప్పినా వినని వారిని నాయకుడు అనరు.. సైకో అంటారని విమర్శించారు. ఇక, ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బాధపడుతూ.. ఆత్మహత్య చేసుకుంటుంటే.. నవ్వే వాళ్లను సైకో అంటారు.. కోర్టుల్లో అడ్వకేట్లు వాదిస్తరు.. అంతిమ న్యాయనిర్ణేత జడ్జిది ఉంటది.. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కర్తవ్యం ఆ పార్టీకి ఉంటది.. ఆయా పార్టీల ఎజెండా ఆయా పార్టీలకు ఉంటది.. కానీ, అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే ఉంటారు అని ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు.