Eatala Rajendar: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. హైడ్రాతో ముఖ్యమంత్రి దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 1965లో అల్వాల్ లో 50 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఓ కాలనీ ఉంది.. ఈ కాలనీకి ఇంటింటికీ నోటీసులు ఇవ్వడమే కాకుండా.. చివరికి గుడులకు కూడా నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.