Harish Rao : రేపు అసెంబ్లీకి కేసీఆర్.. హరీష్ రావు క్లారిటీ..!
- అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ ఫైర్
- హౌస్ కమిటీలపై విమర్శలు
- ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్‌కు మాజీ మంత్రి హరీష్ రావు తెరదించారు. ఆదివారం జరిగిన ఒక చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని అధికారికంగా స్పష్టం చేశారు. కేసీఆర్ రాకతో సభలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్‌కు అసెంబ్లీ అంటే వణుకు: అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీని నిర్వహించాలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సగటున ఏడాదికి 32 రోజుల పాటు సభను నడిపేవారమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సగటును 20 రోజులకు తగ్గించిందని విమర్శించారు. ప్రజా సమస్యలు చర్చకు వస్తాయనే భయంతోనే సమావేశాల కాలాన్ని ప్రభుత్వం కుదిస్తోందని ఆయన ఆరోపించారు.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
తొలిసారిగా హౌస్ కమిటీలు లేవు: శాసనసభ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, ప్రస్తుత ప్రభుత్వం హౌస్ కమిటీలను నియమించకుండా కాలయాపన చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన 18 కమిటీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అలాగే, తాము చర్చించాలని కోరుతూ ఎన్నో లేఖలు రాసినా, ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేయడం, మంత్రులు అడ్డుపడటం వంటివి ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం: ప్రస్తుత సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఐదు లక్షల కోట్ల కుంభకోణంగా తాము భావిస్తున్న నూతన హెల్త్ పాలసీపై సభలో లోతైన చర్చ జరగాలని కోరారు. అలాగే, గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ అంశంపై చర్చకు సిద్ధమైనా తాము కూడా అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.
Suvendu Adhikari: ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, బంగ్లాదేశ్‌కు గుణపాఠం చెప్పాలి..
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!