Telangana MLAs Disqualification Hearings from Nov 6: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగనుంది.. నవంబర్ 6న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్లను విచారిస్తారు. 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆరికెపూడి గాంధీల పిటిషన్ల విచారణ జరుగుతుంది.. 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్లపై రెండోసారి విచారణ కొనసాగనుంది.. 13న పోచారం, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహిస్తారు.. రెండో…
Etela Rajender: బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ బంద్లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని తెలిపారు.
శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి…
రిజర్వేషన్ ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సబ్ప్లాన్ను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బీసీలకు రీజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం.. ఇతర రాష్ట్రాల్లో వచ్చిన అడ్డంకులు తెలంగాణలో రావొద్దన్నదే మా ఆలోచన.. ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులు చేసి పంపితే గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టారు.. గత సర్కార్ 50 శాతం రిజర్వేషన్లు…
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఒకే రోజు పరిమితం చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.
అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, సభ నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది. రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు.