Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, సంచలనాన్ని రేకెత్తించింది. ఒక ఉన్నతమైన ఆశయంతో, భవిష్యత్తులో ఎంతోమందికి సేవ చేయాలనే తపనతో వైద్య విద్యనభ్యసిస్తున్న ఒక ప్రతిభావంతురాలైన యువతి, కొందరు యువకుల తాగుబోతుతనం, అహంకారం కారణంగా ఈ రోజు ఆసుపత్రి బెడ్‌పై జీవన్మరణ పోరాటం చేస్తోంది.
అసలు ఏమి జరిగింది..?
ఈ దారుణ సంఘటన రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ వద్ద చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన ప్రియాంక రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగాంలో పీజీ (వైద్య విద్య) అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీన ప్రియాంక తన స్నేహితుడు ఉమేష్‌తో కలిసి మాల్లో సినిమా చూసి, అనంతరం తమ స్కూటీపై బయటకు వస్తోంది.
Also Read
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
అదే సమయంలో రాజమండ్రి నామవరానికి చెందిన ధస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే ఇద్దరు యువకులు పీకలదాకా మద్యం సేవించి, తీవ్ర వేగంతో, నిర్లక్ష్యంగా కారు నడుపుకుంటూ వచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు మొదట ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని స్వల్పంగా ఢీకొట్టారు. అయితే దీనిపై ప్రియాంక కారు డ్రైవర్ వైపు చూస్తూ నిలదీయడంతో, ఆ తాగుబోతు యువకులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. కోపంతో ఊగిపోతూ, తమ కారుతో ప్రియాంక స్కూటీని మళ్లీ గట్టిగా ఢీకొట్టారు. ఈ ప్రభావానికి ప్రియాంక కిందపడిపోగా, రాక్షసత్వంతో ఆ కారును ఆమె తలపై నుంచి పోనిచ్చారు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రియాంక తలకు అత్యంత తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం ఆమె పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హుటాహుటిన సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమె స్పృహ స్థాయి (GCS – Glasgow Coma Scale) చాలా తక్కువగా పడిపోవడంతో వెంటనే ఇన్‌ట్యూబేషన్ చేసి, పూర్తిస్థాయి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు నిపుణులు ధ్రువీకరించారు. ప్రస్తుతం అవసరమైన సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ, ఆమె ఆరోగ్యంలో ఎలాంటి సానుకూల మార్పు రావడం లేదని స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యులు, స్నేహితుల రోదన..
ప్రియాంక తండ్రి మీడియా ముందుకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. “నా ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు కోసం నేను బతుకుతున్నాను. ఎంతో కష్టపడి డాక్టర్ అయిన నా బిడ్డను ఇద్దరు తాగుబోతుల ఆవేశం బలితీసుకుంది. నా కూతురు పరిస్థితి చూసి నా భార్య కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది” అని వాపోయారు. అయితే.. తమకు ఎంతో గుండెకోతగా ఉన్నప్పటికీ, తమ కుమార్తె అవయవాల ద్వారా మరొకరి ప్రాణాలు నిలబడతాయనే ఆశతో అవయవదానం చేసేందుకు సిద్ధమయ్యామని కన్నీటిపర్యంతమయ్యారు.
మరోవైపు ప్రియాంక స్నేహితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆ తాగుబోతులు కేవలం 30 సెకన్లు తమ ఆవేశాన్ని అణుచుకుని ఉంటే ఈ రోజు ఓ ప్రాణం పోయేది కాదు. పీకలదాకా తాగి రోడ్లెక్కి ఒకరి ప్రాణం తీసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు? ఇది యాక్సిడెంట్ కాదు, తాగిన మత్తులో చేసిన హత్య. ఈ ఘటన ప్రభుత్వం, పోలీసులకు కనువిప్పు కావాలి” అని డిమాండ్ చేశారు.
పోలీసుల చర్యలు..
బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు, సంఘటనా స్థలంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా ప్రకాష్ నగర్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. కారు నడిపిన నిందితులు ధస్వంత్, ఆండ్రూ జోసెఫ్‌లను గుర్తించి అరెస్ట్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిందితులకు కఠిన శిక్ష పడాలని, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసులు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!