CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబడి పెంపు, ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలపై హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల్లో తేవాల్సిన మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆధారమైన జీఎస్టీ రాబడులను పెంచుకోవడంతో పాటు పన్నుల ఎగవేతకు అడ్డుకట్ట వేసేందుకు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సాంకేతికతను రంగంలోకి దించాలని నిర్ణయించారు. వ్యాపారాలు చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తూనే ఈ నూతన సాంకేతికతను వినియోగిస్తామని సీఎం స్పష్టం చేశారు. పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేసేలా ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను వాణిజ్య పన్నుల అధికారులకు అందుబాటులోకి తేనున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో జరిగే పన్నుల లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకోసం మున్సిపల్, రేరా, పంచాయతీ రాజ్, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు అనుమతులు ఇచ్చే ప్రాథమిక దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అయ్యే పన్నుల అంచనాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
ఈ పన్నుల సమాచారంతో పాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) వంటి కీలక పథకాల వివరాలను కూడా ఒకే చోటకు చేరిస్తే పరిపాలన మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండానే పన్నుల వసూళ్లను పెంచడానికి సాంకేతికత ఎంతగానో తోడ్పడుతుందని అరవింద్ సుబ్రమణియన్ వివరించారు. ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?