CM Revanth Reddy : ఖమ్మం జిల్లా ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీకి అగాధమైన అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది కూడా ఇదే నేలలోనని గుర్తు చేశారు. 1969లో ప్రారంభమైన ఉద్యమం 60 ఏళ్ల పాటు కొనసాగడానికి పాల్వంచ కీలక భూమిక వహించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్ర…
CM Revanth Reddy: 2034 జూన్ వరకు తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఏ ఎన్నిక వచ్చిన కోట్లాడత.. నాది లీడర్ మనస్తత్వం కాదు.. క్యాడర్ మనస్తత్వం అన్నారు. డోర్ టు డోర్ కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ.. ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నారు. నాకు ఓపిక.. వయసు ఉందని చెప్పారు. అనంతరం సీఎం రేవంత్ బీజేపీ…
CM Revanth Reddy: ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లైంది.. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.. మీట్ ది ప్రెస్లో సీఎం పాల్గొని మాట్లాడారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసింది.. కానీ.. రాష్ట్రం వచ్చాక ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించారన్నారు. 2004లో ఉచిత కరెంట్పై వైఎస్సాఆర్ మొట్టమొదటి సంతకం చేశారని గుర్తు చేశారు.. రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకుంది..
Bandi Sanjay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్ను నిలిపేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు.
Telangana BJP : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఇలా మంత్రి పదవి ఇవ్వడం…
Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెంగళ్ రావు నగర్ డివిజన్, మధురానగర్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై, మజ్లిస్ పార్టీ పెట్రేగిపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆదివారం ముఖ్యమైన నాయకులు భారీ ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5, 7560mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా…
ఒక రౌడీషీటర్ పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం చాలా దురదృష్టకర సంఘటన అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రే హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అవుతున్నాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు హైకోర్టు ఇవ్వబోయే తీర్పుతో ఎన్నికల భవితవ్యం తేలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ జీఓ చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఈ విచారణలో స్పష్టత రానుంది.
Kishan Reddy : తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నకిలీ వాగ్దానాలు, చేతకాని పాలన, మోసపూరిత హామీలతోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “భారీగా బస్సు ఛార్జీల పెంపుతో తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర భారాన్ని మోపుతోంది. ఇది సామాన్య ప్రజల జీవనంపై నేరుగా దెబ్బతీసే నిర్ణయం. ఇలాంటి ప్రజా…
నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, కాళ్లు కట్టి లాఠీలతో బాదడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.