Suvendu Adhikari: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల హత్యలు, దాడులపై పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, భారత్ కూడా బంగ్లాదేశ్‌కు గుణపాఠం నేర్పాలి’’ అని అన్నారు. శుక్రవారం రోజు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. మన 100 కోట్ల హిందువులు, హిందువుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పినట్లే, బంగ్లాదేశ్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు.
Read Also: Pakistan: “అవును, నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..
బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత, భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత ఆ దేశంలో హిందువుల్ని టార్గెట్ చేశారు. మైమన్‌సింగ్ జిల్లాలో 25 ఏళ్ల విస్త్ర కర్మాగార కార్మికుడు దీపు చంద్రదాస్ ను కొట్టి చంపారు. ప్రజలంతా చూస్తుండగా అతడి నగ్న మృతదేహాన్ని తగలబెట్టారు. ఆ తర్వాత రాజ్‌బరి జిల్లాలో మరో హిందూ వ్యక్తి అమృత్ మండల్‌ను మూకదాడిలో హతమార్చారు. దీనిపై భారత్‌తో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే, సువేందు అధికారి వ్యాఖ్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్పందించింది. వారు ద్వేషం, అసహనాన్ని పద్ధతిగా మార్చుకున్నారని, ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లు, ముస్లింలకు భారత్ గుణపాఠం చెప్పాలని ప్రకటిస్తోందని ఆరోపించింది.
బంగ్లాదేశ్ హింసపై బంగ్లా డిప్యూటీ హైకమిషన్‌ను కలిసిన సువేందు అధికారి మాట్లాడుతూ.. హిందువుల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? అని ప్రశ్నించినట్లు చెప్పారు. బంగ్లాలో 2 కోట్ల మంది హిందువులు నిరంతరం టార్గెట్ అవుతున్నారని, భారత్‌లో ఉన్న 100 కోట్ల మంది హిందువులు నిశ్శబ్ధంగా కూర్చుని చూస్తారని వారు భావిస్తే, తప్పుగా భావించినట్లే అని ఆయన అన్నారు. మహ్మద్ యూనస్ పాలనకు, బెంగాల్లో మమతా బెనర్జీ పాలనకు ఏం తేడా లేదని ఆరోపించారు. అయితే, సువేందు అధికారి వ్యాఖ్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్పందించింది. వారు ద్వేషం, అసహనాన్ని పద్ధతిగా మార్చుకున్నారని, ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లు, ముస్లింలకు భారత్ గుణపాఠం చెప్పాలని ప్రకటిస్తోందని ఆరోపించింది.