Telangana: తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ యాక్టివ్ అయింది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనుల్లో కదిలిక స్టార్ట్ అయింది. ఇప్పటికే పూర్తైన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అనుమతి తీసుకుని నిలిచిపోయిన పలు పరీక్షలనూ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్-4 ఫలితాలు రిలీజ్ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. అయితే, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాడిన తర్వత టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేయడంతో.. వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించిన రెండు రోజుల్లో కమిషన్ కు కొత్త ఛైర్మన్ తో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజినీ, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టారు. టీఎస్పీఎస్సీకి సంబంధించిన వివరాలను చైర్మన్ మహేందర్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే కమిషనన్ తొలి సమావేశం నిర్వహించనుంది.
Read Also: Samantha : సిటాడెల్ వెబ్ సిరీస్ కు డబ్బింగ్ మొదలుపెట్టిన సమంత..ఫొటోలు వైరల్
అయితే, గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 పోస్టులతో విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.80 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు. అయితే, రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు జరగగా.. తొలిసారి పేపర్ లీక్ కావడంతో రద్దు చేయగా, రెండోసారి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని హైకోర్టు క్యాన్సిల్ చేసింది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ కేసు వేసింది. అయితే, ప్రభుత్వం మారడంతో కేసు వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రూప్-1 పోస్టుల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందనే ఆశలు నిరుద్యోగుల్లో స్టార్ట్ అయ్యాయి.
Read Also: Physical assault: సెలూన్ షాప్ యజమాని వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
ఇక, రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ ఇవ్వగా.. గత ఏడాది జులై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 9 లక్షల 51 వేల 205 మంది అప్లై చేయగా 7 లక్షల 62 వేల 872 మంది పేపర్-1 రాయగా.. 7 లక్షల 61 వేల 198 మంది పేపర్-2 రాశారు. ఇక, 5 నెలల కిందే ఫైనల్ కీ రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇప్పటికే రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తైంది. త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ చూస్తుంది. ముందుగా జనరల్ ర్యాంకు లిస్టు (జీఆర్ఎల్) ప్రకటించి.. ఆ తర్వాత పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నా రు.