తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ యాక్టివ్ అయింది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనుల్లో కదిలిక స్టార్ట్ అయింది. ఇప్పటికే పూర్తైన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. గ్రూప్-4 రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తైంది. త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ చూస్తుంది.
Group-4 Results: తెలంగాణలో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సీబీఆర్టీ విధానంలో మే 8, 9, 21, 22 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించి ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్ 20 విడుదల చేసింది.
తెలంగాణలో జులై 1న నిర్వహించిన గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. గ్రూప్-4 రిజల్ట్స్ కు ఇంకా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు.