రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ది బాబ్ హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ లో శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దివ్య నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. సెలూన్ యజమాని మురళి వేధింపులు తాళలేక దివ్య ఆత్మహత్య చేసుకుంది.. గత కొంతకాలంగా దివ్యపై మురళి లైంగికంగా దాడికి పాల్పడుతున్నాడు. సెలూన్ లో ఓ గదిలోకి దివ్యపై లైంగిక దాడికి నిందితుడు యత్నించాడన్నారు. అయితే, దివ్య తప్పించుకొని కేకలు వేయడంతో సెలున్ షాప్ యజమాని పరార్ అయ్యాడు.
Read Also: Hotel Cheating: హోటల్ బిల్లు రూ.6 లక్షలు.. బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు మాత్రమే! ఏపీ మహిళ మోసం
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. దివ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో దివ్య డెడ్‌బాడీకి ఈరోజు పోస్టుమార్టం చేయనున్నారు. ఇక, సెలూన్ షాప్ నిర్వాహకుడు మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌టీవీతో దివ్య కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ.. దివ్య ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు అని తెలిపారు. సెలూన్ లో దివ్యపై మురళి లైంగిక దాడి చేశాడు.. ఆ తర్వాత ఎవరికైనా చెబితే తల్లితో పాటు ఇద్దరు చెల్లెళ్ళను చంపుతానని బెదిరించాడు.. ఆ అవమానం తట్టుకోలేక శానిటైజర్ తాగి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Read Also: Telangana: నేటితో ముగియనున్న సర్పంచుల పదవికాలం..
అయితే, దివ్య శానిటైజర్ తాగిన వెంటనే సెలూన్ నిర్వాహకుడు మురళి భార్య షాప్ దగ్గరకి వచ్చింది.. దివ్యను ఆస్పత్రికి తీసుకొని వెళ్లి చికిత్స అందిచ్చారు.. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి వదిలేశారని దివ్య కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, నిన్న ఉదయం ఇంట్లో దివ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం.. ట్రీట్మెంట్ జరుగుతుండగానే చనిపోయింది.. మురళి భార్య మమ్మల్ని బెదిరించింది.. నా భర్తను ఏమీ చేయలేరు.. అవసరమైతే మీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించింది.. ఇలాంటి ఘటన మరో ఆడపిల్లకు జరగకుండా చూడాలి అని వారు బోరున విలపించారు.