Dead body in sack: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. గోనె సంచిలో ఓ వ్యక్తి మృతదేహం ఉండటం కలకలం రేపింది. లంగర్ హౌస్ ప్రాంతంలో రెండు బస్తాల్లో పక్షవాతానికి గురైన వ్యక్తి మృతదేహం ఛిద్రమైంది. ఎక్కడో చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి రెండు బస్తాల్లో వేశారు. వాటిని లంగర్ హౌజ్ ప్రాంతంలో ఫుట్ పాత్ పై ఉంచారు. గోనె సంచి నుంచి రక్తం వస్తుండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన తీవ్రకలకలం రేపుతుంది. స్థానిక సమచారంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు గోనె సంచి విప్పి చూడగా నిర్ఘాంతపోయారు. గోనె సంచిలో రెండు ముక్కలుగా డెడ్ బాడీ వుండటంతో షాక్ కు గురయ్యారు. స్థానికులు మాట్లాడుతూ.. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బస్తాలను దింపి రోడ్డు పక్కన ఫుట్ పాత్‌పై ఉంచడం చూశామన్నారు. కొద్దిసేపటికి వారికి రక్తస్రావం కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామని అన్నారు. దీంతో పోలీసులు వచ్చి చూడగా అందులో మృతదేహం కనిపించింది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయాందోళన వాతావరణం నెలకొందన్నారు. మిలటరీ ప్రాంతానికి సమీపంలోని బాపూఘాట్ నుంచి లంగర్ హౌజ్‌కు వస్తున్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాళీ మందిరం సమీపంలో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read also: Rajastan Royals Vs Kolkata Knight Riders Match Live: పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయిన జైస్వాల్
పది రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో గోనె సంచిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మహిళను హత్య చేసిన అనంతరం గోనె సంచిలో వేసి రోడ్డుపక్కన ఉన్న పొదల్లో పడేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహం ఎవరిది?, మృతదేహం అక్కడికి ఎలా చేరింది?, హత్య చేసింది ఎవరు? వివరాల సేకరణ ప్రారంభించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Earthquake: కాలిఫోర్నియాలో 5.5 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు