Earthquake: అమెరికాలోని కాలిఫోర్నియాలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంప కేంద్రం కాలిఫోర్నియాలో తూర్పు తీరానికి నైరుతి దిశలో 4 కి.మీ దూరంలో 1.5 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిసింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ప్రాణ నష్టం లేదా ఆస్తినష్టం గురించి ఇంకా సమాచారం లేదు.
Read Also: Viral : కారు డ్రైవింగ్ రాకపోతే ఇంట్లో బజ్జో తల్లి.. అంతేగానీ రోడ్డుపై జనాల ప్రాణం తీయకు
గురువారం, జపాన్ రాజధాని టోక్యో మరియు పరిసర ప్రాంతాలలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనేక మంది గాయపడ్డారు. స్వల్ప నష్టం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, భూకంప కేంద్రం టోక్యోకు ఆగ్నేయంగా ఉన్న చిబా ప్రిఫెక్చర్‌లో ఉంది. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.