Godavari Water Level at 49 Feet at Bhadrachalam: భద్రాచలం గోదావరి నీటిమట్టం తగ్గుదల ప్రారంభమైంది. గురువారం రాత్రి నుంచి స్వల్పంగా గోదావరి తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 49 అడుగులకు చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారన్న విషయం తెలిసిందే. గోదావరి నీటిమట్టం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి.…
Bhadrachalam: గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల వద్ద నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసి జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణరక్షణలో ఎలాంటి లోటు…
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ...రెండు రాష్ట్రాల మధ్య ఉన్న, నలుగుతున్న ఆలయ భూముల గురించి మాత్రం రామయ్య భక్తగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఈవో రమాదేవిపై భూ కబ్జాదారులు దాడి చేశారు. దాడిలో ఆలయ ఈవో స్పృహ తప్పి పడిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది, స్థానికులు ఈవో రమాదేవిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో ఆమె తేరుకున్నారు. భద్రాచలం ఆలయంకు చెందిన భూములు కబ్జా వ్యవహారంలో కొద్ది రోజులుగా ఆక్రమణదారులకి, దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. Also Read: IND vs ENG: మూడో టెస్టులో బుమ్రా ఎంట్రీ..…
కాంగ్రెస్ కంచుకోటలో తేడా రాజకీయం నడుస్తోందా? పార్టీ కోసం చెమటోడ్చిన వాళ్ళని కాదని ఎవరెవరికో పదవులు ఇస్తున్నారన్న అసంతృప్త స్వరాలు పెరుగుతున్నాయా? ఇన్నాళ్ళు లోలోపల రగిలిపోతున్న వాళ్ళు ఇక ఓపెన్ అవుతున్నారా? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా అసంతృప్త నేతలు? కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం. ఆ బలంతోనే…. 2014 ఎన్నికల్లో కేవలం 11 రోజుల ముందు ములుగు నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు…
Bhadrachalam: శ్రీరామనవమిని పురస్కరించుకొని “దక్షిణ అయోధ్య”గా ఖ్యాతిగాంచిన భద్రాచలంలో భక్తుల సందడి నెలకొంది. ప్రతిఏటా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి ప్రాముఖ్యత కలిగిన శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం దశమి రోజున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అర్చకులు సంపూర్ణ సమన్వయంతో భక్తులకు శ్రద్ధాభక్తులతో ఈ ఘట్టాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచే భద్రాచలంలోని మిథిలా స్టేడియంకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్రీరామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య…
Bhadradri : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన రాముల వారి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపధ్యంలో భద్రాచలం పట్టణం వాహనాలతో కిక్కిరిసిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, మూడు గంటలకుపైగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభిజిత్ లగ్నం సమయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. దీన్ని వీక్షించేందుకు టెంపోలుగా, బస్సులుగా, కార్లుగా, ద్విచక్ర వాహనాలుగా భక్తులు సమీప ప్రాంతాల నుండి…
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం.. లబ్ధిదారు కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీశారు.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.