భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య-ఎల్ 1 మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజునే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని సోమనాథ్ తెలిపారు. టార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాన్ని సోమ్‌నాథ్ బయటపెట్టారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని సోమనాథ్ తెలిపారు. అయితే, ఆ సమయంలో క్యాన్సర్ ఉందనే విషయం తనకు స్పష్టంగా తెలియదు, దాని గురించి స్పష్టమైన అవగాహన లేదని పేర్కొన్నారు.
Read Also: TGO- TNGO: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలి..
నివేదిక ప్రకారం.. ఆదిత్య-ఎల్1 మిషన్‌ను ప్రారంభించిన రోజునే తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ రోగ నిర్ధారణ అతనికే కాదు, అతని కుటుంబం మరియు సహోద్యోగులకు కూడా షాక్ ఇచ్చింది. 2023 సెప్టెంబర్ 2న భారత మొదటి సౌర మిషన్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ ఒక ఆపరేషన్ చేయించుకున్నారు. అంతకుముందు రొటీన్ స్కాన్ చేయించుకోగా కడుపులో క్యాన్సర్ వంటిది ఏదో ఉందని నిర్ధారణ అయింది. ఆపరేషన్ అనంతరం ఆయన కీమోథెరపీ కూడా చేయించుకున్నారు. అనంతరం.. తదుపరి స్కానింగ్ కోసం చెన్నైకి వెళ్లారు.
Read Also: SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..
తన అనుభవం, ఎదుర్కొన్న సవాళ్లు గురించి మాట్లాడుతూ, ‘ఇది నా కుటుంబాన్ని, సహోద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ ఇప్పుడు నేను క్యాన్సర్ చికిత్స మాత్రమే ఒక పరిష్కారంగా భావిస్తున్నాను.’ ఈ వ్యాధి వారసత్వంగా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. క్రమం తప్పకుండా చెకప్‌లు, స్కాన్‌లు చేయించుకున్నాను’ అంటూ ఇస్రో చీఫ్ తెలిపారు.