Ukraine Russia War: మరోసారి ఆస్పత్రికి జెలెన్‌స్కీ.. బాధితులకు పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి రోజులు, వారాలు గడుస్తున్నాయి. వరుసగా 23వ రోజు ఉక్రెయిన్‌లో రష్యా ఎడతెగని విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు మారణహోమం సృష్టిస్తోంది. జనావాసాలపైనా రాకెట్ బాంబులు ప్రయోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రధాన నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. గతంలో ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా కనిపించిన ఉక్రెయిన్ నగరాలు.. ఇప్పుడు కకావికలంగా మారాయి. ఎక్కడ చూసిన కూలిన భవనాలు, పొగచూరుకుపోయిన గోడలు, ధ్వంసమైన వాహనాలు వంటివే కనిపిస్తున్నాయి. గతానికి, ఇప్పటికి ఉక్రెయిన్‌లో ఏర్పడిన పరిస్థితులను కళ్లకు కట్టేలా ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒక వీడియో విడుదల చేశారు.
Read Also: Pegasus: ఏపీలో పెగాసెస్ స్పై వేర్ కలకలం.. దీదీ వ్యాఖ్యలతో..!
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
ఇక, యుద్ధం ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా రష్యా లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకపోగా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్ సైనికులు ఉన్నచోట్ల బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ సైనికులు కూడా రష్యా బలగాలను వెంటాడుతున్నారు. తమ దేశంలోకి దురాక్రమణకు వచ్చినవారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యా వైమానిక దళం గగనతలంలోనూ బీభత్సం సృష్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధ విమానాలను వెంటాడి మిసైల్ దాడులతో మట్టుబెడుతున్నాయి. రష్యాకు SU-52 యుద్ధ విమానాల సామర్థ్యం ముందు ఉక్రెయిన్ యుద్ధ విమానాలు తలవంచక తప్పడం లేదు. ఉక్రెయిన్ నగరాల్లోని వాణిజ్య సముదాయాలు, నివాస భవనాలపైనా రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖార్కివ్‌లోని బరవషోవో మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రాకెట్ బాంబులు ప్రయోగించింది. దీంతో మార్కెట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు, రష్యా దాడుల్లో గాయపడిన ఉక్రెయిన్ పౌరులను ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి పరామర్శించారు. రాజధాని కీవ్ నగరంలోని ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.
తాజావార్తలు
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!