YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో పలు జడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాలు పెడుతోన్న విషయం తెలిసిందే.. అయితే, కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపాలిటీలో సొంత పార్టీ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు.. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరుతూ కలెక్టర్ కి లేఖ రాశారు 22 మంది వైసీపీ కౌన్సిలర్లు.. సామర్లకోట మున్సిపాలిటీలో మొత్తం 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు.. 2021 మార్చి 10న జరిగిన ఎన్నికల్లో 29 మంది వైసీపీ, ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు గెలుపొందారు.. వైసీపీ కౌన్సిలర్ గా గెలిచి 2021 మార్చి 17న చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించారు అరుణ..
Read Also: Australia: స్టేజ్ పైనుంచి కింద పడ్డ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ
అయితే, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ టీడీపీతో సఖ్యతగా ఉంటున్నారని చైర్మన్ పై 22 మంది కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ ను కలిశారు 22 మంది వైసీపీ కౌన్సిలర్లు.. అయితే, తనపై అవిశ్వాసం పెట్టే ప్రయత్నం చేస్తూ అవమానిస్తున్నారని ఏడ్చారు చైర్మన్ అరుణ… టీడీపీ ఎమ్మెల్యే రాజప్పతో అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నానని అంటున్నారు.. మరోవైపు చైర్మన్ కు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ కౌన్సిలర్లు మాత్రం ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న బొత్స ను కలిసి చైర్మన్ మార్చి తీరాలని కోరారు..